నేషనల్‌‌‌‌ ఎగ్జామ్స్‌‌‌‌ రోజే టీజీపీఎస్సీ పరీక్షలు..ఒకే రోజు స్టేట్‌‌‌‌, సెంట్రల్‌‌‌‌ పరీక్షలతో సివిల్‌‌‌‌ అభ్యర్థుల్లో ఆందోళన

నేషనల్‌‌‌‌ ఎగ్జామ్స్‌‌‌‌ రోజే టీజీపీఎస్సీ పరీక్షలు..ఒకే రోజు స్టేట్‌‌‌‌, సెంట్రల్‌‌‌‌ పరీక్షలతో సివిల్‌‌‌‌ అభ్యర్థుల్లో ఆందోళన
  • ఈ నెల 26న ఏఏఐ మేనేజర్‌‌‌‌.. అదే రోజు పీసీబీ ఏఈఈ ఎగ్జామ్‌‌‌‌
  • నవంబర్‌‌‌‌ 6న సెంట్రల్‌‌‌‌ జేఈ.. అదే రోజు ఆర్‌‌‌‌అండ్‌‌‌‌బీ ఏఈఈ పరీక్ష
  • తేదీలు మార్చాలని అభ్యర్థుల డిమాండ్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: టీజీపీఎస్సీ నిర్వహించనున్న రెండు రిక్రూట్‌‌‌‌మెంట్‌‌‌‌ పరీక్షలు జాతీయ స్థాయిలో జరిగే ఉద్యోగ పరీక్షలతో క్లాష్‌‌‌‌ అవుతున్నాయి. ఈ నెల 26న ఏఏఐ మేనేజర్‌‌‌‌ (సివిల్‌‌‌‌) పరీక్షతో పీసీబీ ఏఈఈ పరీక్ష, నవంబర్‌‌‌‌ 6న సెంట్రల్‌‌‌‌ జేఈ పరీక్షతో ఆర్‌‌‌‌అండ్‌‌‌‌బీ ఏఈఈ పరీక్ష ఒకే రోజు ఉండటంతో సివిల్‌‌‌‌ ఇంజినీరింగ్‌‌‌‌ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఏఏఐ మేనేజర్‌‌‌‌ (సివిల్‌‌‌‌) పోస్టుల రాతపరీక్షలు ఈ నెల 21 నుంచి 26 వరకు జరగనున్నాయి. ఈ క్రమంలో 26న తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అసిస్టెంట్‌‌‌‌ ఎన్విరాన్‌‌‌‌మెంటల్‌‌‌‌ ఇంజినీర్‌‌‌‌ (ఏఈఈ) పరీక్షను టీజీపీఎస్సీ నిర్వహిస్తోంది.

రెండు పోస్టులకూ సివిల్‌‌‌‌ ఇంజినీరింగ్‌‌‌‌ అభ్యర్థులే అర్హులు కావడంతో రెండు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నవారు ఏదో ఒక పరీక్షను వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే విధంగా కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో జూనియర్‌‌‌‌ ఇంజినీర్‌‌‌‌ (జేఈ) పోస్టులకు నవంబర్‌‌‌‌ 2 నుంచి 6 వరకు పరీక్షలు జరగనున్నాయి. టీజీపీఎస్సీ ఆర్‌‌‌‌అండ్‌‌‌‌బీ ఏఈఈ (సివిల్‌‌‌‌) పరీక్షను నవంబర్‌‌‌‌ 6, 7 తేదీల్లో నిర్వహించనుంది.

దీంతో 6న రెండు పరీక్షలు ఒకే రోజు పడుతున్నాయి. ఈ సమస్యపై ఇప్పటికే టీజీపీఎస్సీ అధికారులను కలిసి వినతిపత్రాలు ఇచ్చినా స్పందన లేదని అభ్యర్థులు చెబుతున్నారు. పరీక్షలకు సమయం దగ్గరపడుతున్నందున వెంటనే పీసీబీ, ఆర్‌‌‌‌అండ్‌‌‌‌బీ ఏఈఈ పరీక్షల తేదీలను మార్చి రీషెడ్యూల్‌‌‌‌ చేయాలని డిమాండ్‌‌‌‌ చేస్తున్నారు. ఈ విషయంపై ‘వీ6 వెలుగు’ టీజీపీఎస్సీ అధికారులను సంప్రదించగా స్పందించలేదు.