ప్రయాణికులకు TGSRTC షాకింగ్ న్యూస్.. మే 31తో సమ్మర్ ఆఫర్ క్లోజ్

ప్రయాణికులకు TGSRTC షాకింగ్ న్యూస్.. మే 31తో సమ్మర్ ఆఫర్ క్లోజ్

హైదరాబాద్: ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసీ షాకింగ్ న్యూస్ చెప్పింది. వేసవి కాలంలో ప్రయాణికులకు ఉపశమనం కలిగించేందుకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రవేశపెట్టిన ప్రత్యేక సమ్మర్ డిస్కౌంట్ ఆఫర్ ముగిసిందని తెలిపింది. మూడు నెలల (మార్చి, ఏప్రిల్, మే) పాటు ఇచ్చిన రాయితీ గడువు  ముగియడంతో 2026, జూన్ 1 నుంచి మెట్రో డీలక్స్, ఏసీ బస్సుల్లో పాత చార్జీలను యథావిధిగా పునరుద్ధరిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. 

ఈ మార్పుపై ప్రయాణికుల్లో ఎలాంటి గందరగోళం లేకుండా ఈ మేరకు శనివారం (మే 30) క్లారిటీ ఇచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో కొత్తగా ఎలాంటి ఛార్జీలను పెంచలేదని, కేవలం వేసవి కాలం కోసం ప్రత్యేకంగా అందించిన సమ్మర్ డిస్కౌంట్ గడువు మాత్రమే ముగిసిందని పేర్కొంది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి సంస్థకు సహకరించాలని అధికారులు కోరారు.

​తీవ్రమైన ఎండల దృష్ట్యా సామాన్య ప్రయాణికులకు సుఖవంతమైన, ఏసీ ప్రయాణాన్ని అందుబాటు ధరల్లో అందించాలనే ఉద్దేశ్యంతో టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి ఆదేశాల మేరకు ఈ సమ్మర్ ఆఫర్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మెట్రో డీలక్స్, ఈ-మెట్రో ఏసీ బస్సుల్లో ప్రయాణించే వారికి 2026, మార్చి నుంచి 2026, మే 31 2026 వరకు ఈ రాయితీలు అందుబాటులో ఉన్నాయి. 

మూడు నెలల పాటు కొనసాగిన సాగిన ఈ ఆఫర్ గడువు ముగియడంతో జూన్ 1వ తేదీ నుంచి రాయితీకి ముందు ఉన్న పాత టికెట్ ధరలే అమలులోకి వస్తాయి. ఈ మూడు నెలల పాటు ఆఫర్‌ను సద్వినియోగం చేసుకొని ఆర్టీసీకి సహకరించిన ప్రయాణికులకు ఈ సందర్భంగా సంస్థ యాజమాన్యం ధన్యవాదాలు తెలియజేసింది.