
హైదరాబాద్: తెలంగాను రోడ్డు రవాణ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న తార్నాక ఆస్పత్రికి పర్యావరణ అవార్డు లభించింది. టీజీఎస్ ఆర్టీసీ తార్నక ఆస్పత్రికి ఉత్తమ పర్యావరణ పరిరక్షణ అవార్డు దక్కింది. పర్యావరణ పరిరక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చినందుకు ఈ అవార్డు లభించింది. ప్రభుత్వ ఆస్పత్రుల కేటగిరిలో బయోమెడికల్ వేస్ట్ మేనేజ్ మెంట్, ప్లాస్టిక్ వేస్ట్ తగ్గింపులో ఆస్పత్రి చేసిన కృషికి గాను ఈ అవార్డు వచ్చింది.
అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్బంగా హైదరాబాద్ లోని సనత్ నగర్ టీబీపీసీబీ కార్యాలయంలో ఈ అవార్డును TGSRTC ఆస్పత్రి బృందానికి మంత్రి
అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ సనత్‌నగర్‌లోని టీజీపీసీబీ కార్యాలయంలో ఈ అవార్డులను ప్రదానం చేశారు. ఈ అవార్డును టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రి బృందానికి ముఖ్యఅతిథిగా వచ్చిన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అందజేశారు.
TGSRTC తార్నాక ఆస్పత్రికి ఉత్తమ పర్యావరణ పరిరక్షణ అవార్డు లభించడం పట్ల ఆ సంస్థ ఎండీ సజ్జనార్ హర్షం వ్యక్తం చేశారు. ఈ అవార్డు ఆస్పత్రిలో ఆరోగ్య సంరక్షణను మెరుగుపర్చడం తోపాటు, పర్యావరణ పరిరక్షణ కొనసాగించేందుకు ప్రేరణ అని అన్నారు ఆస్పత్రిలో బయో-మెడికల్ వేస్ట్ మేనేజ్‌మెంట్, ప్లాస్టిక్ వేస్ట్ తగ్గింపు, ఘన వ్యర్థాల నిర్వహణ పకడ్బందిగా చేస్తోన్న వైద్యులు, సిబ్బందిని ఈ సందర్భంగా సజ్జనార్ అభినందించారు.