- అన్లిమిటెడ్ జర్నీ చేయొచ్చన్న ఆర్టీసీ
హైదరాబాద్ సిటీ, వెలుగు : హైదరాబాద్ లోని బస్సుల్లో ప్రయాణించే వారికి రూ.600 ధరతో వీక్లీ బస్ పాస్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామని టీజీఎస్‌ఆర్టీసీ వీసీ, ఎండీ వై నాగిరెడ్డి తెలిపారు. ఈ పాస్ కొన్న రోజు నుంచి వరుసగా ఏడు రోజులు చెల్లుబాటవుతుందని, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఏసీ బస్సులతో సహా అన్ని రకాల సిటీ బస్సుల్లో అన్లిమిటెడ్జర్నీ చేయవచ్చని అధికారులు తెలిపారు.
పుష్పక్ ఎయిర్‌పోర్ట్ లైనర్ సర్వీసులకు ఈ పాస్ వర్తించదని స్పష్టం చేశారు. సిటీలో తిరిగే ఉద్యోగులు, స్టూడెంట్స్, పర్యాటకులు, బిజినెస్పనులపై వచ్చేవారికి ఈ పాస్ఉపయోగపడుతుందన్నారు. సిటీలోని అన్ని బస్ పాస్ కౌంటర్లలో ఈ పాస్‌లు అందుబాటులో ఉంటాయని, వెల్లడించారు.
