డీజీపీగా నియమించినందుకు సీఎం కేసీఆర్కు థాంక్స్ : అంజనీకుమార్

 డీజీపీగా నియమించినందుకు సీఎం కేసీఆర్కు థాంక్స్ : అంజనీకుమార్

హైదరాబాద్ : తనను డీజీపీగా నియమించినందుకు సీఎం కేసీఆర్కు అంజనీకుమార్ ధన్యవాదాలు తెలిపారు. ప్రజల భద్రతకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. దేశ అభివృద్ధికి తెలంగాణ రాష్ట్రం ఇంజిన్ లాంటిదని చెప్పారు. పోలీస్ వ్యవస్థలో టెక్నాలజీ తీసుకురావడానికి డీజీపీ మహేందర్ రెడ్డి ఎంతో కృషి చేశారని అంజనీకుమార్ తెలిపారు. బంజారాహిల్స్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ తీసుకురావడంలో మహేందర్ రెడ్డి పాత్ర చాలా గొప్పదని చెప్పారు. కానిస్టేబుల్ నుంచి పోలీస్ ఆఫీసర్ వరకు అందరూ ఫీల్డ్లో టెక్నాలజీ ఉపయోగిస్తున్నారని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా 100కి డయల్ చేస్తే..10 నిమిషాల్లో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుంటున్నారని అంజనీకుమార్ తెలిపారు. నేడు డీజీపీగా అంజనీకుమార్ బాధ్యతలు తీసుకోనున్నారు.  

ఇవాళ పదవీ విరమణ చేయనున్న డీజీపీ మహేందర్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ఇవాళ పదవీ విరమణ చేయనున్నారు. 36 ఏళ్ల పాటు పోలీస్ డిపార్ట్మెంట్లో మహేందర్ రెడ్డి వివిధ హోదాల్లో సేవలు అందించారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో డీజీపీ మహేందర్ రెడ్డికి వీడ్కోలు పలకనున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు ఐపీఎస్లు,  పోలీస్ అధికారులు హాజరుకానున్నారు.