
- బీజేపీ స్టేట్ ఇన్చార్జ్ తరుణ్ చుగ్
న్యూఢిల్లీ, వెలుగు: కేసీఆర్ నియంతృత్వ పాలనతో తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ తరుణ్ చుగ్ విమర్శించారు. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అరెస్ట్‌ను ఖండిస్తూ ఆయన గురువారం ఒక వీడియోను రిలీజ్ చేశారు. కేంద్ర మంత్రి అని చూడకుండా కిషన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారని మండిపడ్డారు. బీజేపీ ముఖ్య నేతల్ని హౌస్ అరెస్ట్ చేశారని, వేలాది మంది కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణలోని పేద ప్రజల పక్షాన బీజేపీ పోరాడుతోందన్నారు. 2014, 2019 ఎన్నికల్లో కేసీఆర్ డబుల్ బెడ్రూంల హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ ఇప్పటి వరకు ఇండ్లు ఇవ్వలేదన్నారు. కేసీఆర్ అవినీతి పాలన కారణంగా రాష్ట్ర ప్రజలు అల్లాడుతున్నారన్నారు. పేద ప్రజల పక్షాన నిలుస్తున్న బీజేపీ నేతల్ని జైళ్లకు పంపిస్తున్నారని తరుణ్‌చుగ్ ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌కు ప్రజలు సరైన జవాబు చెబుతారన్నారు.