
వరల్డ్ కప్ 2019కు ఆదివారం సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ దేశాల మధ్య జరిగిన మ్యాచ్ తో ఊపొచ్చింది. ఫేవరిట్లలో ఒకటైన సౌతాఫ్రికాను… ఏడో ర్యాంకర్ బంగ్లాదేశ్ ఓడించడంతో అతిపెద్ద సంచలనం నమోదైనట్టయింది.
బంగ్లాదేశ్ ను ఎప్పుడూ తక్కువ అంచనా వేయడానికి లేదు. అప్రమత్తంగా లేకపోతే.. ఆ జట్టు ప్రపంచకప్ లో బలమైన జట్లను చావుదెబ్బ తీసిన సందర్భాలున్నాయి. బంగ్లాదేశ్ పలుమార్లు ప్రపంచకప్ లో సంచలనాలు నమోదుచేసింది. క్రికెట్ మెగా టోర్నీ అయిన వరల్డ్ కప్ లో… సౌతాఫ్రికాను 2007లోనూ బంగ్లాదేశ్ ఓడించింది. లేటెస్ట్ గా 2019లో సఫారీలపై బంగ్లాదేశ్ గెలుపొంది హిస్టరీ రిపీట్ చేసింది.
2007లో సౌతాఫ్రికాను ఓడించిన జట్టులోని నలుగురు బంగ్లాదేశ్ ప్లేయర్లు.. తాజా జట్టులోనూ ఉన్నారు.
ఆ నలుగురే
- వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీమ్
- కెప్టెన్ ముష్రాఫే మోర్తజా
- ఓపెనర్ తమీమ్ ఇక్బాల్
- స్టార్ ఆల్ రౌండర్ షకీబల్ హసన్.
ఈ నలుగురు బంగ్లా పులులు.. సఫారీలకు చుక్కలు చూపించారు. రెండు మ్యాచ్ లలోనూ విజయంలో ప్రధాన పాత్ర పోషించారు. బంగ్లా క్రికెట్ లెజెండ్స్ గా పేరు తెచ్చుకున్నారు. తాజా మ్యాచ్ లో షకీబ్ 75 రన్స్ , 1 వికెట్ , 1 క్యాచ్ తో ఆల్ రౌండ్ షో చేశాడు. కీపర్ ముష్ఫికర్ 78 రన్స్ చేశాడు.