గోదావరిపై మా దారి మాదే

గోదావరిపై మా దారి మాదే

గోదావరి‌– కృష్ణా – పెన్నా నదుల అనుసంధానం లో తమ దారి తమదేననని ఏపీ మరోసారి స్పష్టం చేసింది. పోలవరం కుడి కాల్వ నుంచి ప్రకాశం బ్యారేజీకి.. అక్కడి నుంచి నాగార్జున సాగర్ కుడి కాల్వ ఆయకట్టుకు.. ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు రాయలసీమకు గోదావరి నీళ్లను తరలిస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఏపీ బడ్ట్జె సమా వేశాల్లో క్లారిటీ ఇచ్చింది. ఏపీ భూభాగం నుంచి సొంతంగానే ప్రాజెక్టును చేపట్టబోతోంది. గవర్నర్ ప్రసంగంలోనూ ఈ నదుల అనుసంధానాన్ని ప్ర ధానంగా ప్రస్తావించింది. ఏపీ ఇలా సొంత దారి చూసుకోవడంతో తెలంగాణతో కలిపి చేపట్టాల్సిన  నదుల అనుసంధానం ప్రాజెక్టుకు బ్రేక్ పడింది.

560 కిలోమీటర్ల దూరం తీసుకెళ్తరు

పోలవరం నుంచి పెన్నా బేసిన్కు.. మొత్తంగా 560 కిలోమీటర్ల దూరం నీళ్లను తరలించాలని ఏపీ సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం ఆరు దశల్లో నీటిని లిప్ట్ వేయాల్సి ఉంటుందని ప్రపోజల్స్ రెడీ చేశారు. ఇందుకు 9 వేల మిలియన్యూనిట్ల కుపైగా కరెంట్ అవసరమని లెక్కగట్టారు .ప్రకాశం బ్యారేజీ మినహా ఇంకెక్కడా గోదావరి నీళ్లు కృష్ణా నదిలో కలవకుండానే మళ్లించనున్నారు.

రోజుకు 3 టీఎంసీల చొప్పున నీటిని తరలించేందు కు రూ.68 వేల కోట్లకుపైగా ఖర్చవుతుందని వ్యా ప్కోస్ అంచనా వేసింది. ప్రకాశం బ్యారేజీ వరకు ఖర్చు చేసేది రూ.13 వేల కోట్లుఅయితే.. అక్కడి నుంచి నాగార్జున సాగర్ కుడి కాల్వ, ప్రకాశం, నెల్లూరు , రాయలసీమ జిల్లాలకు నీళ్లు మళ్లించడానికి ఇంకో రూ.55 వేల కోట్లు ఖర్చు కానుంది. అదనంగా 300 టీఎంసీలు మళ్లింపు పోలవరం వద్ద గోదావరి ప్రవాహం ఉధృతంగా ఉంటుంది. సగటున అక్కడ 120 రోజులకుపైగా వరద ఉంటున్నట్టు అంచనా వేశారు. పోలవరం కుడి కాల్వ ద్వారా ఇప్పటికే తరలిస్తున్న 80 టీ ఎంసీలకు తోడు ఇప్పుడు చేపట్టేకొత్త ప్రాజెక్టు ద్వారా మరో 300 టీఎంసీలను మళ్లించే అవకాశముందని చెప్తున్నారు. వరద ఎక్కువగా ఉంటే ఇంకో 90 టీఎంసీలనూ తీసుకోవచ్చని అంచనా వేస్తున్నారు. 200 టీఎంసీలతో భారీ రిజర్వాయర్ పోలవరం నుంచి మళ్లించే గోదావరి నీళ్లను నిల్వ చేసేందుకు ప్రకాశం జిల్లా బొల్లాపల్లిలో 200 టీ ఎంసీలతో భారీ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మిం చాలని ఏపీ నిర్ణయించింది. అక్కడి కొండల మధ్య సముద్ర మట్టానికి 209 మీటర్ల ఎత్తులో  నిర్మించే ఈ రిజర్వాయర్ కింద 17 గ్రామాలు ముంపునకు గురవుతాయని అంచనా వేస్తున్నారు. ఆ రిజర్వాయర్ నిర్మాణానికి ఇప్పటికే వ్యాప్కోస్ రూపొందిం చిన డీపీఆర్ ప్రభుత్వ పరిశీలనలో ఉంది. పోలవరం నుంచి మొదలుపెట్టి .. పోలవరం కుడి కాల్వ ప్రస్తుత కెపాసిటీ 17,633 క్యూసెక్కులు, పొడవు 174 కిలోమీటర్లు. దాని కింద 3 లక్షల 20 వేల ఎకరాల ఆయకట్టుఉంది. ప్రస్తుత కెపాసిటీతో రోజుకు ఒకటిన్నర టీఎంసీల నీళ్లను మళ్లించే అవకాశముంది. ఈ కాల్వ ద్వారా వానాకాలంలో 80 టీఎంసీల గోదావరి నీళ్లను కృష్ణా డెల్టాకు మళ్లించి 13.08 లక్షల ఎకరాల ఆయకట్టును ఇప్పటికే స్టెబి లైజ్ చేస్తున్నారు. ఇప్పుడా కాల్వ కెపాసిటీని 50 వేల క్యూ సెక్కులకు పెంచుతున్నారు. అదనంగా రోజూ మరో మూడు టీఎంసీల నీళ్లను మళ్లిస్తారు . పోలవరం కుడి కాల్వతో కనెక్టివిటీ చేసే  ట్విన్ టన్నెళ్ల కెపాసిటీని 20 వేల క్యూసెక్కుల నుంచి 50 వేల క్యూసెక్కులకు పెంచుతారు. దానికి రూ.727 కోట్లు అవుతుందని అంచనా వేశారు. ఈ పనులు పూర్తయితే పోలవరం నుంచి రోజుకు నాలుగున్నర టీఎంసీలను ప్రకాశం బ్యారేజీకి తరలిస్తారు. రాయల సీమకు తరలించేదిలా.. ప్రకాశం బ్యారేజీకి ఎగువన హరిశ్చం ద్రపురం వద్ద లిఫ్టు ఏర్పాటు చేసి రోజుకు రెండు టీఎంసీల నీటిని నాగార్జునసాగర్ కుడి కాల్వలోకి ఎత్తిపోస్తా రు. కుడికాల్వపై 80వ కిలోమీటర్ వద్ద నకరికల్లు ప్రాంతంలో ఆయకట్టుకు నీళ్లిస్తూ తూనే.. ప్రకాశం జిల్లాలో కొత్తగా నిర్మించే బొల్లాపల్లి బ్యాలెన్సింగ్ రి జర్వాయర్కు, అక్కడి నుంచి పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన ఉన్న బనకచర క్రాస్ రెగ్యులేటర్ కు  తరలిస్తారు. ఏపీ సర్కారు పట్టిసీమ ఎత్తిపో తల ద్వారా ఇప్పటికే 80 టీఎంసీల నీళ్లను ప్రకాశం బ్యారేజీ మీదుగా కృష్ణాడెల్టాకు మళ్లిస్తోంది. దానికి అదనంగా ఇప్పుడు మరో 300 టీఎంసీలనూ తర లించుకోనున్నారు.

కేసీఆర్, జగన్ మూడు సార్లు భేటీ

జగన్ సీఎం అయ్యాక గోదావరి- కృష్ణాపెన్నా నదుల అనుసంధానంపై కేసీఆర్, జగన్ మూడు సార్లుభేటీ అయ్యారు. ఏపీ, తెలంగాణ ఇంజనీ ర్లురెండు సార్లుసమావేశమై ఎక్కడి నుంచి గోదావరి నీళ్లను మళ్లిస్తే రెండు రాష్ట్రాలకు ఉపయోగకరంగా ఉంటుందో చర్చించారు. టోపోషీట్ల ఆధారంగా పలు అలైన్మెంట్లను పరిశీలించి నాలుగు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇక ఈ ప్రాజెక్టును మొదలు పెట్టడమే తరువాయి అనుకుంటున్న టైంలో బ్రేక్ పడింది. ఏపీ సొంతంగా పోలవరం నుంచి నదుల అను సంధానం చేపట్టేం దుకు వ్యాప్కోస్ తో డీపీఆర్ తయారు చేయించిం ది. గతేడాది డిసెంబర్ 26నే దానిని మొదలు పెట్టేం దుకు ముహూర్తం కూడా నిర్ణయించి తర్వాత రద్దుచేశారు. తర్వాత ఇరు రాష్ట్రాలు కలిసే ఉమ్మడి ప్రాజెక్టును చేపడ తాయని, ఫిబ్రవరిలో కేసీఆర్, జగన్ మరోసారి భేటీ అవుతారని ప్రకటన వచ్చింది. కానీ ఇరు రా ష్ట్రాల మధ్య నదుల అనుసంధానంపై ఎలాంటి చర్చా జరగలేదు. ఏపీ సర్కారు నదుల అను సంధానంపై ఐదు ప్రత్యామ్నాయాలను స్ట డీ చేసి చివరికి ఒక ప్రపోజల్ కు ఓకే చెప్పింది. నిధులను సమీకరించడానికి ‘ఏపీ సమగ్ర నీటి పారుదల అభివృద్ధి సంస్థ’ను ఏర్పాటుచేశారు.