కృష్ణమ్మ మూవీ మే 10న విడుదల

కృష్ణమ్మ మూవీ మే 10న విడుదల

సత్యదేవ్ హీరోగా డైరెక్టర్ కొరటాల శివ సమర్పణలో రూపొందిన చిత్రం ‘కృష్ణమ్మ’. వీవీ  గోపాలకృష్ణ దర్శకత్వం వహించాడు. కృష్ణ కొమ్మలపాటి నిర్మించారు. మే 10న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా సత్యదేవ్ మాట్లాడుతూ ‘బెజవాడ బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సాగే కథ ఇది.  విజయవాడ అంటే పాలిటిక్స్, రౌడీయిజం అని చెప్తారు. కానీ అది కాదని చెప్పే చిత్రమే ‘కృష్ణమ్మ’.  

ఇది ముఖ్యంగా ముగ్గురు స్నేహితుల కథ. వాళ్ళ చిన్న జీవితాలతో హ్యాపీగా ఫ్యామిలీని లీడ్ చేయాలనుకుంటారు. అలాంటి డ్రీమ్ చెడగొడితే ముగ్గురు ఫ్రెండ్స్  ఏం చేశారు అనేదే ఆసక్తికరంగా ఉంటుంది. నా క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో  ప్రేక్షకులు  కనెక్ట్ అవుతారు.  వించిపేట భద్ర అనే క్యారెక్టర్ కోసం, విజయవాడ స్లాంగ్ కోసం, ఆ బాడీ లాంగ్వేజ్ కోసం, కథలో కొన్నేళ్ల తర్వాత 40 ఏళ్ళ వ్యక్తిగా, పొగరు, పగ.. ఇలాంటివి అన్నీ నా పాత్రలో చూపించడం ఛాలెంజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా అనిపించింది.  ఇప్పటివరకు చేసిన పాత్రలకు ఇది డిఫరెంట్.  

రియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా జరిగిన కొన్ని సంఘటనల నుంచి తీసుకొని ఫిక్షనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రాసిన కథ.  బాధ నుంచి వచ్చే  రివెంజ్ మర్చిపోతానేమో  అని ఒక మొక్క పెంచుకుంటా.  ఆ మొక్క ఎంత పెరిగితే పగ అంత పెరుగుతుంది. మొక్క నుంచి వృక్షం వరకు డైరెక్టర్ చాలా బాగా రాసాడు. ఇలాంటి కొత్త సీన్స్ సినిమాలో చాలా ఉన్నాయి. కొరటాల శివ గారు కథ నచ్చి ప్రజెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా సినిమాకు సపోర్ట్ చేశారు. కాల భైరవ మ్యూజిక్ ప్లస్ అవుతుంది’ అని చెప్పాడు.