ఇవాళ్టి నుంచి ఇంటర్ కాలేజీల్లో అడ్మిషన్లు

ఇవాళ్టి నుంచి ఇంటర్ కాలేజీల్లో అడ్మిషన్లు
  • షెడ్యూల్ రిలీజ్ చేసిన ఇంటర్ బోర్డు 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అన్ని మేనేజ్ మెంట్ల పరిధిలోని జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం ఇంటర్ బోర్డు షెడ్యూల్ రిలీజ్ చేసింది. 2024–25 విద్యా సంవత్సరానికి గాను గురువారం నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్నదని ప్రకటించింది. ఈ నెల 9 నుంచి 31 వరకూ కాలేజీల్లో అప్లికేషన్లు తీసుకోవాలని సూచించింది. జూన్ 1 నుంచి క్లాసులు ప్రారంభమవుతాయని వెల్లడించింది. మొదటి విడత అడ్మిషన్ల ప్రక్రియను జూన్ 30లోగా పూర్తి చేయనున్నట్టు తెలిపింది. గుర్తింపు ఉన్న కాలేజీల్లోనే అడ్మిషన్లు తీసుకో వాలని పేరెంట్స్, స్టూడెంట్లకు సూచించింది. 

గుర్తింపున్న కాలేజీల వివరాలను https://tsbie.cgg.gov.in తో పాటు http://www.acad.tsbie.telangana.gov.in  వెబ్ సైట్ లో పెడుతామని అధికారులు చెప్పారు. అడ్మిష న్లలో రిజర్వేషన్లు పాటించాలని, మహిళలకు 33% సీట్లు కేటాయించాలని తెలిపారు. టెన్త్ లో వచ్చిన జీపీఏ ఆధారంగా సీట్లు కేటాయిం చాలని, ఎలాంటి అడ్మిషన్ టెస్టులు నిర్వహిం చొద్దని కాలేజీలను ఇంటర్ బోర్డు ఆదేశించిం ది. నిబంధనలకు విరుద్ధంగా పరీక్షలు పెడితే, చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.