ఫిఫా వరల్డ్ కప్లో మెస్సీకి పలు రికార్డులు దాసోహం

ఫిఫా వరల్డ్ కప్లో  మెస్సీకి పలు రికార్డులు దాసోహం

ఫిఫా వరల్డ్ కప్ ఫస్ట్ సెమీస్లో అర్జెంటీనా దిగ్గజం మెస్సీ  పలు రికార్డులను సాధించాడు. క్రొయేషియాతో జరిగిన మ్యాచ్ ద్వారా మెస్సీ ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక మ్యాచులు (25) ఆడిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. ఫిఫా ప్రపంచకప్లో ఇప్పటి వరకు జర్మనీ ఫుట్బాల్ ప్లేయర్ లోథర్ మాథస్ పేరిట ఈ రికార్డు ఉండేది. ప్రస్తుతం మెస్సీ ఈ రికార్డును సమం చేశాడు. అర్జెంటీనా ఫైనల్ చేరిన నేపథ్యంలో..మెస్సీ ఈ రికార్డును బద్దలు కొడతాడు. 

గోల్స్ రికార్డు..

ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలో అర్జెంటీనా తరపున అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా కూడా మెస్సీ రికార్డు నెలకొల్పాడు. క్రొయేషియాతో జరిగిన సెమీస్లో మెస్సీ ఒక్క గోల్ చేశాడు. మొత్తంగా అర్జెంటీనా తరపున ఫిఫాలో మెస్సీ 11 గోల్స్ కొట్టాడు.  తద్వారా ఫుట్బాల్ దిగ్గజం డిగో మారడోనా సహా గాబ్రియెల్‌ బటిస్టుటా, గిల్మెరో స్టబిలేను మెస్సీ దాటేసి టాప్ ప్లేస్లో నిలిచాడు. 

అతి పెద్ద వయస్కుడు..

ఫిఫా వరల్డ్ కప్ 2022లో మెస్సీ ఇప్పటి వరకు 6 మ్యాచులు ఆడి 5 గోల్స్ సాధించాడు. దీంతో  ప్రపంచకప్‌లో 5 గోల్స్ చేసిన అతి పెద్ద వయస్కుడిగా 35 ఏళ్ల మెస్సీ రికార్డు సృష్టించాడు.

ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్...

ఈ వరల్డ్ కప్లో మెస్సీ ఇప్పటివరకు  నాలుగు సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను సొంతం చేసుకున్నాడు. దీంతో ఫిఫా  వరల్డ్ కప్లో  నాలుగు సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్న ఆటగాడిగా మెస్సీ రికార్డు నెలకొల్పాడు. దీంతో పాటు..ఫిఫా వరల్డ్ కప్లో అత్యధిక మ్యాచులు ఆడిన కెప్టెన్గా మెస్సీ రఫా మార్క్వెజ్ రికార్డును బద్దలు కొట్టాడు.