2026 ఆసియా క్రీడలు సెప్టెంబర్ 19 నుండి అక్టోబర్ 4 వరకు జరుగుతాయి. ఆసియా క్రీడల్లో క్రికెట్ కొనసాగనుంది. టీ20 ఫార్మాట్ లో ఆసియా క్రీడల్లో క్రికెట్ జరగనుంది. క్రికెట్‌తో సహా కొన్ని విభాగాలు ముందే ప్రారంభమవుతాయని ఐచి-నగోయా ఆసియా క్రీడల నిర్వాహక కమిటీ (AINAGOC) బుధవారం (జనవరి 14) విడుదల చేసిన షెడ్యూల్‌లో ఉంది. ఆసియా క్రీడలు 19 నుంచి ప్రారంభమైన క్రికెట్ మాత్రం సెప్టెంబర్ 17 నుంచి స్టార్ట్ కానుంది. ఉమెన్స్ మ్యాచ్ లు సెప్టెంబర్ 17 న ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 22 న గోల్డ్ మెడల్ మ్యాచ్ జరుగుతుంది.
మెన్స్ క్రికెట్ విషయానికి వస్తే సెప్టెంబర్ 24 నుంచి మ్యాచ్ అక్టోబర్ 3 వరకు మ్యాచ్ లు జరుగుతాయి. అక్టోబర్ 3 న గోల్డ్ నాదల్ మ్యాచ్ జరుగుతుంది. ఎనిమిది జట్లు పోటీ పడుతుండటంతో క్వార్టర్ ఫైనల్స్ తో నాకౌట్ పోటీ స్టార్ట్ అవుతుంది. ఇండియా డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతోంది. 2023 ఆసియా క్రీడల్లో భారత జట్టు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో భారత్ కు గోల్డ్ మెడల్ వచ్చింది. 2023మాదిరిగానే 2026 ఆసియా క్రీడల్లో సీనియర్లు ఆసియా గేమ్స్ లో ఆడే అవకాశాలు కనిపించడం లేదు. బీసీసీఐ యంగ్ ఇండియాను ఈ టోర్నీ కోసం పంపనున్నట్టు సమాచారం.
భారత క్రికెట్ లో ఎంతో మంది టాలెంటెడ్ ఆటగాళ్లున్నారు. భారత బి జట్టును పంపినా గోల్డ్ మెడల్ సాధించడం పక్కాగా కనిపిస్తుంది. 2010లో తొలిసారిగా ఆసియా క్రీడల్లో క్రికెట్ ఆడారు. ఆ తర్వాత, 2014లో కూడా క్రికెట్ కొనసాగింది కానీ 2018లో తొలగించబడింది. 2022లో హువాంగ్‌జౌలో జరిగిన ఆసియా క్రీడల సమయంలో క్రికెట్ మళ్లీ కంబ్యాక్ ఇచ్చింది. 2023 ఆసియా క్రీడల్లో సైతం క్రికెట్ ను జరిపారు. ఆ ఆతర్వాత మరోసారి ఆసియా క్రీడల్లో క్రికెట్ ను ఉంచాలా లేదా అనే విషయంలో అనిశ్చితి ఉన్నపటికీ.. క్రికెట్ ఉండాలని ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా శుభవార్త చెప్పింది.
2026 ఆసియా క్రీడల్లో మహిళల క్రికెట్ షెడ్యూల్:
మహిళల క్రికెట్ పోటీలు సెప్టెంబర్ 17న క్వార్టర్ ఫైనల్స్‌తో ప్రారంభమై సెప్టెంబర్ 22న బంగారు పతక పోటీతో ముగుస్తాయి.
సెప్టెంబర్ 17: క్వార్టర్-ఫైనల్స్ 1 అండ్ 2
సెప్టెంబర్ 18: క్వార్టర్ ఫైనల్స్ 3 అండ్ 4
సెప్టెంబర్ 20: సెమీ-ఫైనల్స్
సెప్టెంబర్ 22: కాంస్య పతక మ్యాచ్, గోల్డ్ మెడల్ మ్యాచ్
అన్ని మ్యాచ్‌లు భారత కాలమాన ప్రకారం ఉదయం 5:30 గంటలకు అదేవిధంగా 10:30 గంటలకు ప్రారంభమవుతాయి.
2026 ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ షెడ్యూల్:
పురుషుల టోర్నమెంట్ సెప్టెంబర్ 24న ప్రిలిమినరీ క్వాలిఫయర్స్‌తో ప్రారంభమవుతుంది. అక్టోబర్ 3 వరకు కొనసాగుతుంది.
సెప్టెంబర్ 24–26: ప్రిలిమినరీ క్వాలిఫయర్స్
సెప్టెంబర్ 28–29: క్వార్టర్-ఫైనల్స్
అక్టోబర్ 1: సెమీ-ఫైనల్స్
అక్టోబర్ 3: కాంస్య పతక మ్యాచ్, గోల్డ్ మెడల్ మ్యాచ్
అన్ని మ్యాచ్‌లు భారత కాలమాన ప్రకారం ఉదయం 5:30 గంటలకు అదేవిధంగా 10:30 గంటలకు ప్రారంభమవుతాయి.
