
హైదరాబాద్: ఈనెల 10 న అర్థరాత్రి జరిగిన ఎంఐఎం నాయకుని హత్యకేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఆర్థిక లావాదేవీలే కారణమని పోలీసులు తెలిపినా….తన కొడుకు ఎదుగుదలను ఓర్వలేకనే సొంత పార్టీకి చెందిన వారే హత్య చేశారని మృతుడు కలీల్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కలీల్ హత్య కేసుకు సంబంధించి రషీద్ , ఇమ్రాన్ , అజర్ లను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు.
అయితే ప్రధాన నిందితులు వారు కాదని , పహడీ బస్తీకి చెందిన ఎంఐఎం నాయకులు డీఎం మరియు షేక్ బాబులు ప్రధాన సూత్రదారులని కలీల్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. కలీల్ రాజకీయంగా ఎదుగుతున్నాడని అది ఓర్వలేకనే ఈ హత్యకు పథకం పన్నారని ఆరోపించారు. దీనిపై పోలీసులు సమగ్ర దర్యాప్తు జరిపించి నిజమైన నిందితులను అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని కోరారు.