
నర్సంపేట, వెలుగు: బిడ్డను వేధిస్తున్నాడని అల్లుడిని అత్త మర్డర్ చేసింది. పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. వరంగల్ రూరల్ జిల్లా రాములునాయక్ తండాకు చెందిన బానోత్ ఈరు(40) కొన్నేళ్లుగా అత్తవారింట్లోనే ఉంటున్నాడు. మద్యానికి బానిసై నిత్యం భార్యతో గొడవ పడేవాడు. శుక్రవారం బానోత్ఈరు, అతని భార్య, అత్త ఓ ఫంక్షన్‌కు వెళ్లారు. వీరు ముగ్గురు మద్యం తాగి ఇంటికి వచ్చారు. భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో మద్యం మత్తులో ఉన్న అత్త క్షణికావేశంలో రోకలి బండతో ఈరు తలపై కొట్టింది. దీంతో స్పాట్లో మృతిచెందాడు. నర్సంపేట రూరల్ సీఐ సతీశ్‌బాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు.