
కన్న తల్లి కసాయి తల్లిగా మారింది. నవ మాసాలు మోసిన తల్లి ఆడపిల్ల పుట్టిందని ఆస్పత్రి వద్ద వదిలేసి వెళ్లిపోయింది. ఈ ఘటన వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో జరిగింది. పుట్టిన శిశువును ఆస్పత్రి మెయిన్ గేటు దగ్గర వదిలేసి వెళ్లిపోయింది ఓ తల్లి. తెల్లవారు జామున శిశువు కేకలు వేస్తుండటంతొ ఆసుపత్రికి వచ్చిన వారు చూసి పోలీసులకు సమాచారం అందిచారు. పోలీసులు శిశువును చేర దీసి ఎంజీఎంలోని పిల్లల వార్డులో చేర్పించారు. అన్ని పరిక్షలు నిర్వహించిన డాక్టర్లు శిశువు ఆరోగ్యంగా ఉందని చెప్పారు. శిశువుకు ఏలాంటీ ఇబ్బంది లేదని, ఆడ శిశువు అనే కారణంతోనే తల్లి వదిలేసినట్లుగా చెబుతున్నారు వైద్యులు.