గత వారం ఒడిదుడుకులు ఎదుర్కొన్న బెంచ్‌‌మార్క్ ఇండెక్స్‌‌లు

గత వారం  ఒడిదుడుకులు ఎదుర్కొన్న బెంచ్‌‌మార్క్ ఇండెక్స్‌‌లు

న్యూఢిల్లీ: బెంచ్‌‌మార్క్ ఇండెక్స్‌‌లు కిందటి వారం  తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. చివరికి  సెన్సెక్స్‌‌  271 పాయింట్లు (‌‌‌‌0.46 శాతం)  నష్టంతో వారాన్ని ముగించింది. ఈ వారం మార్కెట్‌‌లను నడిపించేది కంపెనీల క్వార్టర్లీ రిజల్ట్స్‌‌,  గ్లోబల్ అంశాలని ఎనలిస్టులు చెబుతున్నారు.  మార్కెట్‌‌ల నుంచి విదేశీ ఇన్వెస్ట్‌‌మెంట్ల అవుట్‌‌ ఫ్లోస్‌‌/ఇన్‌‌ఫ్లోస్‌‌ కూడా మార్కెట్‌‌ కదలికలపై ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. వీటికి అదనంగా రూపాయి కదలికలను, క్రూడాయిల్ మార్కెట్‌‌ను కూడా ట్రేడర్లు గమనించాలని సలహాయిస్తున్నారు. ‘క్యూ2 రిజల్ట్స్‌‌, గ్లోబల్ అంశాల నుంచి డైరెక్షన్ పొందాలని మార్కెట్ చూస్తోంది.

ఈ వారం చాలా ఫైనాన్షియల్ కంపెనీలు, సిమెంట్‌‌ కంపెనీలు తమ క్వార్లర్లీ రిజల్ట్స్‌‌ను ప్రకటించనున్నాయి. గ్లోబల్ మార్కెట్‌‌లు గత కొన్ని సెషన్ల నుంచి వోలటాలిటీతో కదులుతున్నాయి. దీంతో మన మార్కెట్‌‌లోనూ వోలటాలిటీ కనిపించొచ్చు’ అని స్వస్తిక్ ఇన్వెస్ట్మార్ట్‌‌ రీసెర్చ్ హెడ్‌‌ సంతోష్ మీనా అన్నారు. గ్లోబల్ అంశాల విషయానికొస్తే యూఎస్‌‌, చైనా ఎకనామిక్ డేటాపై ట్రేడర్లు దృష్టి పెట్టాలని సలహాయిచ్చారు. యూఎస్ బాండ్‌‌ ఈల్డ్‌‌, డాలర్ ఇండెక్స్, క్రూడాయిల్‌‌ కదలికలపై దృష్టి పెట్టాలని అన్నారు. సోమవారం సెషన్‌‌లో హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్ రిజల్ట్స్‌‌, ప్రభుత్వం విండ్‌‌ఫాల్ ట్యాక్స్‌‌ పెంచడంపై మార్కెట్‌‌లు స్పందిస్తాయని ఎనలిస్టులు పేర్కొన్నారు. ఈ వారంలోనే ఏసీసీ, అల్ట్రాటెక్, ఇండస్‌‌ఇండ్ బ్యాంక్‌‌, యాక్సిస్ బ్యాంక్‌‌, ఏషియన్ పెయింట్స్‌‌, బజాజ్ ఫైనాన్స్‌‌, ఐటీసీ, హిందుస్తాన్ యూనిలీవర్‌‌‌‌ కంపెనీలు తమ క్వార్టర్లీ రిజల్ట్స్‌‌ను ప్రకటించనున్నాయి. యూఎస్ మార్కెట్‌‌లు శుక్రవారం సెషన్‌‌లో భారీగా నష్టపోయాయి.  ఎస్‌‌జీఎక్స్ నిఫ్టీ సుమారు ఒక శాతం తగ్గి 17,046 లెవెల్‌‌కు పడిపోయింది. సోమవారం సెషన్‌‌లో మార్కెట్‌‌లు నష్టాల్లో ఓపెన్ అయ్యే అవకాశం కూడా ఉంది.