నాలుగు రాష్ట్రాల్లో  బీజేపీకి కొత్త చీఫ్‌‌లు

నాలుగు రాష్ట్రాల్లో  బీజేపీకి కొత్త చీఫ్‌‌లు
  • ఢిల్లీ, రాజస్థాన్‌‌, బీహార్‌‌‌‌, ఒడిశాకు పార్టీ అధ్యక్షులను నియమించిన జేపీ నడ్డా

న్యూఢిల్లీ: బీజేపీ అధిష్టానం నాలుగు రాష్ట్రాలకు కొత్త చీఫ్‌‌లను నియమించింది. ఢిల్లీ, రాజస్థాన్‌‌, బీహార్‌‌‌‌, ఒడిశాకు కొత్త అధ్యక్షుల పేర్లను పార్టీ ప్రెసిడెంట్‌‌ జేపీ నడ్డా గురువారం ప్రకటించారు. రాజస్థాన్‌‌కు లోక్‌‌సభ ఎంపీ సీపీ జోషి, బీహార్‌‌‌‌కు ఓబీసీ లీడర్‌‌‌‌, ఎమ్మెల్సీ సామ్రాట్ చౌధరి, ఒడిశాకు రాష్ట్ర మాజీ మంత్రి మన్మోహన్ సామాల్‌‌, ఢిల్లీకి ఆ రాష్ట్ర బీజేపీ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌ వీరేంద్ర సచ్‌‌దేవాను అధ్యక్షులుగా అధిష్టానం నియమించింది. కుష్వాహా కమ్యూనిటీకి చెందిన ఎమ్మెల్సీ చౌధరిని లోక్‌‌సభ ఎంపీ సంజయ్‌‌ జైశ్వాల్‌‌ స్థానంలో బీజేపీ రాష్ట్ర చీఫ్‌‌గా నడ్డా నియమించారు. ఎమ్మెల్యే సతీశ్‌‌ పూనియా స్థానంలో బ్రాహ్మణ వర్గానికి చెందిన సీపీ జోషిని రాజస్థాన్‌‌ రాష్ట్ర అధ్యక్షుడిగా అపాయింట్‌‌ చేశారు. రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్న ప్రముఖ లీడర్‌‌‌‌, మాజీ ఎంపీ అయిన మన్మోహన్‌‌ సామాల్‌‌ను ఒడిశా చీఫ్‌‌గా నియమించారు.  గతంలో కూడా ఆయన ఒడిశాకు అధ్యక్షుడిగా పనిచేశారు. పార్టీ ఢిల్లీ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌గా ఉన్న వీరేంద్ర సచ్‌‌దేవాను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది.