బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం..ఎంపీలకు మోడీ దిశా నిర్దేశం

బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం..ఎంపీలకు మోడీ దిశా నిర్దేశం

ఢిల్లీలోని పార్లమెంట్ లైబ్రరీ భవనంలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు, బీజేపీ లోక్ సభ, రాజ్యసభ ఎంపీలు హాజరయ్యారు. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలు, కేంద్ర పథకాలు, బడ్జెట్ ను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ఎంపీలకు ప్రధాని మోడీ, జేపీ నడ్డా దిశానిర్దేశం చేశారు. లోక్ సభ, రాజ్యసభలో విపక్ష సభ్యులు లెవనెత్తుతున్న అంశాలను ఏ విధంగా ఎదుర్కోవాలనే దానిపై కూడా ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను జేపీ నడ్డా అభినందించారు.