కొత్త మెడికల్ కాలేజీలకు రూ. 1000 కోట్లు

కొత్త మెడికల్ కాలేజీలకు రూ. 1000 కోట్లు

ఈ సారి బడ్జెట్ లో నూతన మెడికల్ కాలేజీల నిర్మాణం కోసం  రూ. 1000 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రాబోయే రెండేళ్ల‌లో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఈ సంవత్సరం కొత్తగా 8 వైద్య  కళాశాలలను, ఆసిఫాబాద్‌, భూపాలపల్లి,  వికారాబాద్‌, సిరిసిల్ల, జనగామ, కామారెడ్డి,  కరీంనగర్‌, ఖమ్మం జిల్లాలలో  ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.  2023 సంవత్సరంలో  రాష్ట్రంలోని మిగతా ఎనిమిది జిల్లాలైన మెదక్‌, మేడ్చల్‌, రంగారెడ్డి, ములుగు, వరంగల్‌, నారాయణపేట, గద్వాల, యాదాద్రిల్లో మెడికల్‌ కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.

తెలంగాణ బడ్జెట్ 

  •  బడ్జెట్ 2,56,958.51 కోట్లు
  • వ్యవసాయ రంగానికి 24,254 కోట్లు
  • ఆసరా పెన్షన్లకు 11728 కోట్లు
  • కల్యాణ లక్ష్మీ, షాది ముబారక్ కు 2750 కోట్లు
  • డబుల్ బెడ్రూమ్ ల కోసం 12000 కోట్లు
  • దళితబంధు 17వేల 7వందల కోట్లు.
  • మన ఊరు- మన బడి 7289  కోట్లు.
  • ఎస్టీల సంక్షేమం కోసం 12565 కోట్లు
  • పట్టణ ప్రగతి కోసం 1394 కోట్లు
  • బిసి సంక్షేమం కోసం 5698కోట్లు
  • బ్రాహ్మణుల సంక్షేమం కోసం 177 కోట్లు
  • పల్లె ప్రగతి 3330 కోట్లు
  • ఫారెస్ట్ యూనివర్సిటీకి 100 కోట్లు
  • హరితహారంకు 932 కోట్లు
  • రోడ్లు, భవనాల కోసం 1542 కోట్లు