ఓన్లీ నేమ్ ఛేంజర్ : కవిత

ఓన్లీ నేమ్ ఛేంజర్ : కవిత
  • కాంగెస్​ప్రభుత్వం గేమ్ ఛేంజర్ కాదు
  • ఓటాన్​బడ్జెట్​పై ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్: ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో పూర్తిగా కేటాయింపులు చేయలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు.  శాస‌న‌మండ‌లిలో ప్రభుత్వం బ‌డ్జెట్ ప్రవేశ‌పెట్టిన అనంత‌రం ఎమ్మెల్సీ క‌విత మీడియాతో మాట్లాడారు.  రానున్న ఐదేండ్ల ప్రణాళికకు సంబంధించి బడ్జెట్ లేదన్నారు. ఎన్నికల హామీల గురించి ఎక్కడా చెప్పలేదని మండిపడ్డారు. గత ప్రభుత్వాన్ని విమర్శించడానికే సమావేశాలు నిర్వహించినట్లు ఉందన్నారు. పథకాలకు పాత పేర్లను తీసేసి కొత్తవి పెట్టారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఓన్లీ నేమ్ ఛేంజింగ్ మాత్రమేనని, గేమ్ ఛేంజర్ కాదని కవిత అన్నారు.