వాస్తవాలకు దగ్గరగా బడ్జెట్‌‌‌‌‌‌‌‌ను రూపొందించాలి..మాజీమంత్రి హరీశ్‌‌‌‌‌‌‌‌రావు

వాస్తవాలకు దగ్గరగా బడ్జెట్‌‌‌‌‌‌‌‌ను రూపొందించాలి..మాజీమంత్రి హరీశ్‌‌‌‌‌‌‌‌రావు

సిద్దిపేట, వెలుగు : కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ఇచ్చిన హామీలకు నిధులు కేటాయించడంతో పాటు వాస్తవాలకు దగ్గరగా బడ్జెట్‌‌‌‌‌‌‌‌ రూపొందించాలని మాజీమంత్రి హరీశ్‌‌‌‌‌‌‌‌రావు సూచించారు. సిద్దిపేటలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని సోనియా, రాహుల్ రాసిచ్చిన బాండ్‌‌‌‌‌‌‌‌ పేపర్లు ఏమాయ్యాయని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు అయినా ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు. రూ. 4 వేల పెన్షన్‌‌‌‌‌‌‌‌ కోసం ఈ బడ్జెట్‌‌‌‌‌‌‌‌లోనైనా నిధులు కేటాయిస్తారా ? లేదా అని ప్రశ్నించారు. బీసీ సబ్‌‌‌‌‌‌‌‌ ప్లాన్‌‌‌‌‌‌‌‌ అమలు చేస్తామని, బీసీలకు 42 శారం రిజర్వేషన్లు ఇస్తామని, ఏటా రూ. 20 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక.. బీసీలకు మొండి చేయి చూపుతున్నారన్నారు. రైతుబంధు, పంటల బీమా, బోనస్‌‌‌‌‌‌‌‌ పేరుతో రైతులను మోసం చేశారని మండిపడ్డారు. యువత కోసం ప్రవేశపెడతామన్న రాజీవ్‌‌‌‌‌‌‌‌ యువ వికాసం అమలు కాలేదన్నారు. కనీసం ఈ బడ్జెట్‌‌‌‌‌‌‌‌నైనా వాస్తవాల ఆధారంగా, వాస్తవికతకు దగ్గరగా రూపొందించాలని 
సూచించారు.