కేసీఆర్​కు ఈ నెల 2నే ఆహ్వానం పంపినం

కేసీఆర్​కు ఈ నెల 2నే ఆహ్వానం పంపినం
  • ప్రధానితో కలిసి వేడుకలో పాల్గొనాలని కోరినం

  • స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ, వెలుగు: ప్రధాని రాష్ట్ర పర్యటనలో సీఎం కేసీఆర్ కు ఆహ్వానం పంపలేదన్న టీఆర్​ఎస్​ నేతల విమర్శలను కేంద్ర ప్రభుత్వం తిప్పికొట్టింది. ఈ నెల 2నే కేసీఆర్​కు ఆహ్వాన లేఖ పంపినట్లు బుధవారం స్పష్టం చేసింది.ఈ నెల 2నే కేసీఆర్​కు ఆహ్వాన లేఖ పంపినట్లు బుధవారం స్పష్టం చేసింది. ఈ నెల 12న రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ రీ ఓపెన్​కు ప్రధాని మోడీ రానున్నందున.. ఆ కార్యక్రమంలో పాల్గొనాలని సీఎం కేసీఆర్ ను ఆహ్వానిస్తూ కేంద్ర ఎరువుల శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ లెటర్​ రాశారని గుర్తు చేసింది. దీన్ని రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ సీఈవో సీఎం ముఖ్య కార్యదర్శికి అందించారని పేర్కొంది. లేఖ ప్రతిని విడుదల చేసింది. రామగుండం ఎన్టీపీసీ స్టేడియంలో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని జాతికి ప్రధాని మోడీ అంకితం చేస్తారని, కార్యక్రమంలో పాల్గొనాలని సీఎం కేసీఆర్​ను కేంద్ర మంత్రి మాండవియా ఆహ్వానిస్తున్నట్లు లెటర్​లో ఉంది. అదేవిధంగా రైల్వే కొత్త లైన్, 3 హైవే ప్రాజెక్ట్ లకు మోడీ ఫౌండేషన్ స్టోన్ వేస్తారని వివరించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రోగ్రాంను సక్సెస్ చేయడంలో సహకారం అందించాలని కేసీఆర్​ను కేంద్ర మంత్రి లేఖలో కోరారు.