ఇండియా టెక్నాలజీలో మార్పులు ఆశ్చర్యానికి గురి చేస్తున్నయ్‌‌

ఇండియా టెక్నాలజీలో మార్పులు ఆశ్చర్యానికి గురి చేస్తున్నయ్‌‌
  • గూగుల్‌‌ సీఈవో సుందర్‌‌‌‌ పిచాయ్‌‌

న్యూఢిల్లీ: ఇండియా సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులు తనను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయని గూగుల్‌‌,ఆల్ఫాబెట్‌‌సీఈవో సుందర్ పిచాయ్‌‌అన్నారు. గ్లోబల్‌‌ఏఐలో భారత్‌‌కీలక పాత్ర పోషిస్తోందని ప్రశంసించారు. గురువారం ఢిల్లీలో జరిగిన ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్‌‌సమిట్‌‌’లో ఆయన మాట్లాడారు.

తన విద్యార్థి దశలో కోరమాండల్‌‌ ఎక్స్ ప్రెస్‌‌లో చెన్నై నుంచి ఐఐటీ ఖరగ్‌‌పూర్‌‌‌‌కు వెళ్లేటప్పుడు విశాఖపట్నం మీదుగా ప్రయాణించిన జ్ఞాపకాలను ఆ గుర్తుచేసుకున్నారు. వైజాగ్‌‌లో ఏఐ హబ్‌‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. భారత్‌‌లోని రద్దీ రోడ్లపై డ్రైవర్‌‌‌‌లెస్‌‌ కార్లు తిరిగితే తాను సంతోషిస్తానని తన తండ్రి చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ.. ‘‘దానిపై ఇంకా పని జరుగుతుంది నాన్న గారు..” అని చెప్పారు.

గూగుల్‌‌ ఆల్ఫాబెట్‌‌ రూపొందించిన ‘వేమో’ డ్రైవర్‌‌‌‌లేని ట్యాక్సీల గురించి ఆయన ప్రస్తావించారు. మరోవైపు, న్యూరల్‌‌ జీసీఎం మోడల్‌‌ద్వారా కోట్ల మంది భారత రైతులకు వాతావరణ అంచనాలను అందించడంలో ఇండియా  సాధించిన విజయాన్ని అభినందించారు. అలాగే, భారత్‌‌, అమెరికా మధ్య డేటా వేగాన్ని పెంచేందుకు 4 కొత్త సముద్రగర్భ ఫైబర్‌‌‌‌ ఆప్టిక్‌‌ కేబుల్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.