హిమాచల్​ సీఎం కుర్చీ కోసం నేతల పోటాపోటీ

హిమాచల్​ సీఎం కుర్చీ కోసం నేతల పోటాపోటీ
  • మాజీ సీఎం కాన్వాయ్​ను అడ్డగించిన కార్యకర్తలు
  • సిమ్లాలో అబ్జర్వర్ల కాన్వాయ్​ అడ్డగింత
  • సిమ్లాలోని ఒబెరాయ్ సీసిల్‌‌ వద్ద ఘటన
  • సీఎం పదవిని తనకే ఇవ్వాలన్నట్లుగా ప్రతిభ కామెంట్లు
  • తన భర్త వీరభద్ర సింగ్ పేరు చెప్పుకునే ఎన్నికల్లో గెలిచామని వెల్లడి
  • ముఖ్యమంత్రి పదవి తనకే ఇవ్వాలన్నట్లుగా ప్రతిభ కామెంట్లు
  • తన భర్త వీరభద్ర సింగ్ పేరుతోనే  ఎన్నికల్లో గెలిచామని వెల్లడి
  • ముఖ్యమంత్రి పదవి తనకే ఇవ్వాలన్నట్లుగా ప్రతిభ కామెంట్లు
  • తన భర్త వీరభద్ర సింగ్ పేరుతోనే  ఎన్నికల్లో గెలిచామని వెల్లడి

సిమ్లా: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి 24 గంటలు కూడా కాలేదు.. గెలుపు సంబురాలైనా సక్కగ చేసుకున్నరో లేదో.. అప్పుడే సీఎం పదవి కోసం పైరవీలు.. అడ్డగింతలు.. బల ప్రదర్శనలు.. హైకమాండ్‌కు పరోక్ష హెచ్చరికలు.. హిమాచల్‌ ప్రదేశ్‌లో పరిస్థితి ఇది. ఎక్కడైనా ఓడితే సమస్యలు వస్తాయి.. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో గెలిచినా సమస్యలే..! ప్రభుత్వ ఏర్పాటు, సీఎం అభ్యర్థి ఎంపిక తదితర అంశాలను దగ్గరుండి చూసుకునేందుకు వచ్చిన కాంగ్రెస్ అబ్జర్వర్లలో ఒకరు, చత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్ బాఘెల్ కాన్వాయ్‌ని సొంత కార్యకర్తలే అడ్డుకున్నారు. ఆయన కారును చుట్టుముట్టి.. తమ లీడర్‌‌ ప్రతిభా సింగ్‌ను సీఎంను చేయాలంటూ నినాదాలు చేశారు. శుక్రవారం సిమ్లాలోని ఒబెరాయ్ సిసిల్‌ వద్ద జరిగిందీ ఘటన. సీఎల్పీ మీటింగ్‌కు ముందు జరిగిన ఈ ఘటనతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

గవర్నర్‌‌తో కాంగ్రెస్ అబ్జర్వర్లు భేటీ

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌‌తో కాంగ్రెస్ అబ్జర్వర్లు భేటీ అయ్యారు. శుక్రవారం సిమ్లాకు వచ్చిన మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా.. బాఘెల్, శుక్లాతో పాటు గవర్నర్‌‌ను కలిశారు. తమకు మెజారిటీ ఉందని గవర్నర్‌‌కు తెలియజేశామని హుడా చెప్పారు. అంతకుముందు భూపేశ్ బాఘెల్, భూపిందర్ సింగ్ హుడా, రాజీవ్ శుక్లా తదితరులు 
ప్రతిభా సింగ్‌తో భేటీ అయ్యారు.

రాష్ట్రాన్ని నడిపించగలను: ప్రతిభా సింగ్

హిమాచల్ సీఎం పదవి రేసులో ఉన్న ప్రతిభా సింగ్ ప్రస్తుతం ఎంపీగా, హిమాచల్ కాంగ్రెస్ చీఫ్‌గా కొనసాగుతున్నారు. ఎన్నికల ప్రచారాన్ని ముందుండి నడిపించారు. కానీ అసెంబ్లీకి పోటీ చేయలేదు. ఈ నేపథ్యంలో సీఎం పదవిని ప్రతిభకే ఇవ్వాలన్న డిమాండ్‌తో ఆమె మద్దతుదారులు.. పార్టీ అబ్జర్వర్​గా వచ్చిన చత్తీస్ గఢ్​ సీఎం భూపేశ్ బాఘెల్ కాన్వాయ్‌ని అడ్డగించారు. ‘నా భర్త వీరభద్ర సింగ్ పేరు చెప్పుకునే బరిలోకి దిగాం. ఎన్నికల్లో గెలిచాం. ఆయనతో ఉన్న బలమైన భావోద్వేగ బంధం వల్లే ప్రజలు 40 సీట్లలో గెలిపించారు. ఇప్పుడు వీరభద్ర ఫ్యామిలీని పక్కకి తప్పించడం సరికాదు. సీఎంగా రాష్ట్రాన్ని నేను నడిపించగలనని భావిస్తున్నా” అని ప్రతిభ చెప్పుకొచ్చారు. ‘‘సీఎం ఎంపికలో హైకమాండ్ నిర్ణయమే ఫైనల్​. కానీ వీరభద్ర వారసత్వం విస్మరించకూడదు” అని స్పష్టంచేశారు. కాంగ్రెస్ మాజీ సీఎం వీరభద్ర సింగ్ కిందటేడాది చనిపోయారు.