పోలీస్ స్టేషన్లకు అద్దె లొల్లి..ఓనర్ల ఒత్తిళ్లపై ఫిర్యాదు

పోలీస్ స్టేషన్లకు అద్దె లొల్లి..ఓనర్ల ఒత్తిళ్లపై ఫిర్యాదు

హైదరాబాద్, వెలుగు :‘‘మార్చి, ఏప్రిల్, మే నెలల ఇంటి అద్దెలు వసూలు చేయొద్దు. తర్వాత నెలల్లో వాయిదాల్లో వసూలు చేసుకోవాలి. ఇది  ఓనర్లకు అప్పీల్​ కాదు, గవర్నమెంట్​ ఆదేశం” అని సీఎం కేసీఆర్​ ప్రకటించిన రెండ్రోజుల్లోనే హైదరాబాద్​ సిటీలో ఓనర్లు, సొసైటీ మెంబర్ల ఒత్తిళ్లు అక్కడక్కడా బయటపడ్డాయి. లాక్ డౌన్​తో ఉపాధి లేక చిన్నా, పెద్ద ఉద్యోగులు, సామాన్యులు అవస్థలు పడుతున్నారు. ఆర్థిక లావాదేవీలకు ఆస్కారం లేకపోవడంతో చేతిలో డబ్బు కరువైంది. ఇలాంటి టైంలో అద్దెకు ఉండేవాళ్లను రెంట్లు, మెయింటెనెన్స్ కోసం ఇబ్బంది పెట్టొద్దని సీఎం చెప్పినా ఫలితం లేకపోతోంది.

3  నెలల మెయింటెనెన్స్​ అడిగిన్రు…

పుప్పాలగూడలోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో 250 ఫ్యామిలీస్‌ ఉంటున్నాయి. ఒక్కో కుటుంబం ప్రతీ నెల రూ. 6వేల మెయింటెనెన్స్ చెల్లించాలి. కాగా, వచ్చే మూడు నెలల మొత్తాన్ని ఇప్పుడే చెల్లించాలని సొసైటీ మెంబర్లు ఒత్తిడి చేస్తున్నారని ఆయా ఫ్యామిలీస్‌ వాపోతున్నాయి. ఇదే విషయంలో కమిటీ మెంబర్లు, ఫ్లాట్స్​ఓనర్లకు మధ్య జరిగిన గొడవ పోలీస్​ స్టేషన్ వరకు వెళ్లింది. కంప్లయింట్‌ తీసుకున్న నార్సింగి పోలీసులు ప్రస్తుతానికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. తర్వాత చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇలాంటి కంప్లయింట్లు  గ్రేటర్​లో రోజూ పదుల సంఖ్యలో వస్తున్నాయి.

సేవలు  నిలిపేస్తమంటూ..

గవర్నమెంట్​ ఆదేశాల ప్రకారం.. రెంట్, మెయింటెనెన్స్ కట్టకపోయినా సేవలు నిలిపేయడానికి వీల్లేదు. కానీ  అపార్ట్​మెంట్​ అసోసియేషన్లు, ఓనర్లు కరెంట్, వాటర్ సప్లయ్ నిలిపివేయడం, చెత్త క్లీన్​ చేయకపోవడం, కారిడార్ లో బయటకు తిరగొద్దని ఆదేశించడం వంటివి చేస్తున్నారని పలువురు వాపోతున్నారు. కరెంట్ కట్ చేస్తామనని బెదిరించడంతో సుచిత్ర సర్కిల్‌లో ఓనర్‌పై కిరాయిదారుడు కంప్లయింట్‌ చేశాడు. పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. కాగా.. సేవలు నిలిపేసే అధికారం ఓనర్లు, కమిటీ మెంబర్లకు లేదని, అలాచేస్తే చట్టపరంగా చర్యలు  తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. రెంట్ కు ఉన్న వారితో  అమర్యాదగా మాట్లాడకూడదనే స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయంటున్నారు.

ఓనర్లకు బ్యాంకు లోన్ల కష్టాలు

ప్రస్తుత పరిస్థితుల్లో కొందరు ఓనర్లు కూడా ఇబ్బంది పడుతున్నారు. హౌసింగ్ లోన్ తీసుకుని ప్రతి నెల రెంట్ల ద్వారా వచ్చే డబ్బును ఈఎంఐలుగా చెల్లించి, మిగిలిన వాటిని మెయింటెన్స్​కు ఖర్చు చేస్తున్నవాళ్లు సిటీలో చాలామంది ఉన్నారు. ఇలాంటి వారికి టైమ్​కు రెంట్ రాకున్నా, నిర్వహణ ఇబ్బందవుతుందని విద్యానగర్ లోని ఓ అపార్ట్‌మెంట్ కమిటీ మెంబర్‌ రామ్మోహన్ చెప్పారు.

నార్సింగి పరిధిలోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఐటీ ఎంప్లాయ్‌‌ ఫ్యామిలీ ఉంటోంది.  ప్రతి నెలా ఇచ్చే మెయింటెనెన్స్ డబ్బును వచ్చే మూడు నెలలకు కలిపి ముందుగానే చెల్లించాలని అపార్ట్‌‌మెంట్ కమిటీ అతడిపై ఒత్తిడి చేసింది. ఇదేంటని అడిగితే సోమవారం నైట్​ కరెంట్, వాటర్ కట్​చేసింది.

సుచిత్ర సర్కిల్ లోని ఓ అపార్ట్‌‌మెంట్లో రిటైర్డ్ ఎంప్లాయ్‌‌ అద్దెకు ఉంటున్నాడు. రెంట్​ కోసం ఓనర్​ పదేపదే ఫోన్​ చేస్తు న్నాడు. కొద్ది రోజుల తర్వాత ఇస్తానని చెప్పినా పట్టించుకోకపోవడంతో 100కి కాల్‌‌ చేసి కంప్ల యింట్​ చేశాడు. పోలీసులు ఇద్దరికీ సర్దిచెప్పారు.

రెండ్రోజుల కిందట జరిగిన సంఘటనలివి.

ఓనర్లకు బ్యాంకు లోన్ల కష్టాలు

ప్రస్తుత పరిస్థితుల్లో కొందరు ఓనర్లు కూడా ఇబ్బంది పడుతున్నారు. హౌసింగ్ లోన్ తీసుకుని ప్రతి నెల రెంట్ల ద్వారా వచ్చే డబ్బును ఈఎంఐలుగా చెల్లించి, మిగిలిన వాటిని మెయింటెన్స్​కు ఖర్చు చేస్తున్నవాళ్లు సిటీలో చాలామంది ఉన్నారు. ఇలాంటి వారికి టైమ్​కు రెంట్ రాకున్నా, నిర్వహణ ఇబ్బందవుతుందని విద్యానగర్ లోని ఓ అపార్ట్‌మెంట్ కమిటీ మెంబర్‌ రామ్మోహన్ చెప్పారు.