బాకీ vs డోఖా.. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య కార్డుల రాజకీయం

బాకీ vs డోఖా.. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య కార్డుల రాజకీయం
  • జూబ్లీహిల్స్, స్థానిక ఎన్నికల్లో పొలిటికల్ హీట్
  •  పదేండ్ల పాలనను ఎత్తి చూపుతున్న కాంగ్రెస్ 
  • గ్యారెంటీలు, హామీల పై బీఆర్ఎస్ ప్రచారం

రాష్ట్రంలో కార్డుల రాజకీయం మొదలైంది. ఆరు గ్యారెంటీలు, 420 హామీలంటూ బీఆర్ఎస్ పార్టీ ఇటీవల విడుదల చేసిన బాకీ కార్డుకు దీటుగా కాంగ్రెస్ వాళ్ళ దోఖా కార్డును విడుదల చేసింది. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో చేసిన డోఖా అంశాలను కార్డుల్లో ప్రస్తావించింది. హనుమకొండ కాంగ్రెస్ కార్యాలయంలో బీఆర్ఎస్ కా డోఖా కార్డును కాంగ్రెస్ ఎమ్మె ల్యేలు, ఎంపీ, నేతలు ఇవాళ విడుదల చేశారు. బీఆర్ఎస్ గతంలో హామీలు  ఇచ్చి అమలు చేయని పనులతో దోఖా కార్డును కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీ కడియం కావ్య, నేతలు విడుదల చేశారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కేటీఆర్కు సవాల్ విసిరారు.

బీఆర్ఎస్ అవినీతిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని, కేటీఆర్ సిద్ధమా? అని చాలెంజ్ చేశారు. ప్రజలు బీఆర్ఎస్ నేతలను చూసి స్టూవర్టుపురం దొంగల్లా సిగ్గుపడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ పాపాలను ప్రజల్లోకి తీ సుకెళ్లేందుకే దోఖా బాజ్ కార్డు విడుదల చేస్తున్నామని, కాంగ్రెస్ క్యాడర్ అంతా ఈకార్డును డౌన్ లోడ్ చేసుకుని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు.  ఇదిలా ఉండగా గత నెల 27న బీ ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్ రావు, ఇతర మాజీ మంత్రులు, ముఖ్యనేతలు తెలంగాణ భవన్ లో కాంగ్రెస్ బాకీకార్డును విడుదల చేశారు. ఈ కార్డును ప్రతి ఇంటికీ చేర్చాలని సూచించారు. 22 నెలల పాలనలో మహిళలకు రూ. 2500 హామీ కింద ఒక్కో క్కరికి రూ. 55 వేలు, వృద్ధులకు పెన్షన్ నెలకు రూ. 4 వేల హామీ కింద ఒక్కొక్కరికి రూ.44 వేలు, వికలాంగులకు పెన్షన్ రూ. 6 వేల హామీ కింద ఒక్కొక్కరికి రూ. 44 వేలు, షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి కింద ఆడబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడినట్లు బీఆర్ఎస్ పేర్కొంది. నిరుద్యో గులకు 2 లక్షల ఉద్యోగాలు, విద్యార్థినులకు స్కూటీ కూడా బాకీగా మిగిలి ఉన్నాయని తెలిపింది.

 స్థానిక సంస్థల్లో పాగా కోసం

 జుబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ రాజకీయ వ్యూహాలు పన్నుతున్నాయి. బీఆర్ఎస్ పదేండ్ల పాలన విస్మరించిన అనేక అంశాలను కాంగ్రెస్ నేతలు డోఖా కార్డులో ప్రస్తావించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేనందున ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని పేర్కొంటున్నారు.జూబ్లీహిల్స్ తో పాటు స్థానిక ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు విడుదల చేసిన కార్డులు ఏ మేరకు ప్రభావం చూపుతాయన్నది హాట్ టాపిక్ గా మారింది.