పుంజుకుంటున్న దేశ కమర్షియల్ రియల్‌‌‌‌‌‌ ఎస్టేట్‌‌‌‌ సెక్టార్‌‌‌‌‌‌‌‌  

పుంజుకుంటున్న దేశ కమర్షియల్ రియల్‌‌‌‌‌‌ ఎస్టేట్‌‌‌‌ సెక్టార్‌‌‌‌‌‌‌‌  

బిజినెస్ డెస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: దేశ కమర్షియల్ రియల్ ఎస్టేట్ సెక్టార్ దూసుకుపోతోంది. ప్రజల కొనుగోలు సామర్ధ్యం నెమ్మదిగా తిరిగి కరోనా ముందు స్థాయిలకు చేరుకుంటుండడంతో డెవలపర్లు కొత్త మాల్స్ నిర్మాణానికి సై అంటున్నారు.  వచ్చే ఏడాది చివరి నాటికి   కొత్తగా 31 మాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓపెన్ అవుతాయని ప్రాపర్టీ కన్సల్టన్సీ కంపెనీ అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాక్  రిపోర్ట్  అంచనావేసింది.  రిటైల్ స్టోర్లు పెరగడంతో కొత్త ఉద్యోగాలు క్రియేట్ అవ్వడమే కాకుండా, షాపింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసేవాళ్లు కూడా ఎక్కువవుతారని తెలిపింది.  ఈ రిపోర్ట్ ప్రకారం, షాపింగ్ మాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని రిటైల్ స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కిందటేడాదితో పోలిస్తే   76 శాతం పెరుగుతుంది. ఈ ఏడాది చివరి నాటికి 15 షాపింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓపెన్ అవుతాయి. మిగిలిన 16 మాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వచ్చే ఏడాది చివరి నాటికి అందుబాటులోకి వస్తాయి. కొత్త మాల్స్ అందుబాటులోకి రావడం వలన  కేవలం డెవలపర్లు, ఇన్వెస్టర్లు  మాత్రమే లాభపడరని, కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా క్రియేట్ అవుతాయని  ఈ రిపోర్ట్ వివరించింది.   

చిన్న సిటీలపై ఫోకస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..

చిన్న సిటీలలోనూ కొత్త మాల్స్  ఓపెన్ అవుతున్నాయని అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెల్లడించింది.  చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ముంబై, పుణె, ఘజియాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటి పెద్ద సిటీలతో పాటు బరోడా, బడౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇండోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఉదయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటి టైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2, 3 సిటీలలో కూడా కొత్త మాల్స్  వస్తున్నాయని వివరించింది. మొత్తం 12 సిటీలలో కొత్త మాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓపెన్ అవుతున్నాయని అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాక్ రిపోర్ట్ వెల్లడించింది. ఈ మధ్య కాలంలో  రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లకు మాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేరాఫ్ అడ్రస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారుతున్నాయని మహాగన్ గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్ అమిత్ జైన్ అన్నారు. అందుబాటులోకి వస్తున్న మాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కమర్షియల్ రియల్ ఎస్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చూస్తుంటే కరోనా సంక్షోభం నుంచి ఈ సెక్టార్ బయటకొచ్చేసినట్టు అనిపిస్తోందని అన్నారు. 

పెరుగుతున్న ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లు.. 

 లాభాలు బాగుండడంతో రిటైలర్లు కూడా మాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, షాపింగ్ కాంప్లెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటి కమర్షియల్ స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో  ఇన్వెస్ట్ చేస్తున్నారని ఎనలిస్టులు పేర్కొన్నారు.  కన్జూమర్లు ఎక్కువ మంది రావడానికి అనువైన ప్రాంతాల్లో  ఉండడంతో ఇటువంటి ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లు పెరుగుతున్నాయని  అన్నారు. దీంతో డెవలపర్లు కూడా ఇలాంటి ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను  తీసుకురావడానికి  ప్రయత్నిస్తున్నారని, ఫలితంగా కొత్త ఉద్యోగాలు క్రియేట్ అవుతున్నాయని పేర్కొన్నారు. అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాక్  రిపోర్ట్ ప్రకారం అయితే,  దేశంలోని టైర్ 1, 2, 3 సిటీలలో 1.015 కోట్ల చదరపు అడుగుల్లో  కొత్త మాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడీ అవుతున్నాయి. ఈ మాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి వస్తాయి.   మరోవైపు 70.25 లక్షల చదరపు అడుగుల్లో మాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రానున్నాయి. కొత్తగా అందుబాటులోకి రానున్న మొత్తం 31 షాపింగ్ మాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గరిష్టంగా నాలుగు మాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒక్క చెన్నైలోని డెవలప్ అవుతున్నాయి. ఇవి 20.55 లక్షల చదరపు అడుగుల్లో నిర్మితమవుతున్నాయి. తాజా ట్రెండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చూస్తే  కరోనా తర్వాత కమర్షియల్ రియల్ ఎస్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మంచి పొజిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నట్టు  తెలుస్తోందని ఓరియన్ వన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దుశ్యంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగ్ అన్నారు. రియల్ ఎస్టేట్ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జాబ్స్ భారీగా పెరుగుతాయని అంచనావేశారు. ‘టైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2, 3 సిటీల నుంచి రెస్పాన్స్ బాగుంది. ప్రభుత్వం పెద్ద ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను నిర్మించాలనుకుంటున్న సిటీలకు  డెవలపర్లూ వెళుతున్నారు. దీంతో ఆయా ప్రాంతాల ఎకానమీ కూడా మెరుగుపడుతుంది’ అని అన్నారు..