వాయుగుండం ప్రభావంతో ఏపీలో వానలు

వాయుగుండం ప్రభావంతో ఏపీలో వానలు

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. సోమవారానికి బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది తుపానుగా మారే అవకాశముందని హెచ్చరించింది వాతావరణ శాఖ. అండమాన్  దీవుల వెంట ఉత్తరం వైపు కదులుతుందని తెలిపింది. బుధవారం మయన్మార్ లోని తాండ్వే సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఏపీలో పలుచోట్ల వర్షాలు పడ్డాయి. విశాఖ మన్యంలో భారీ వర్షం కురిసింది. నర్సీపట్నం, పాడేరు, కొయ్యూరు, హుకుంపేట, కోటవురట్ల మండలాల్లో ఈదురుగాలులతో వడగళ్లు పడ్డాయి. తోటలు, పంటపొలాలు దెబ్బతిన్నాయి. పలుగ్రామాల్లో రహదారులపై భారీ వృక్షాలు నేలకొరగడంతో వాహనాల రాకపోకలు నిలిచాయి. విద్యుత్ తీగలపై చెట్లకొమ్మలు విరిగిపడటంతో కరెంట్ సరఫరా నిలిచింది.

మరిన్ని వార్తల కోసం

సామాన్యులకు షాక్.. పెరిగిన వంట గ్యాస్ ధర

ఒళ్లు దగ్గర పెట్టుకోవాలె..ఎవరెవరు ఏమేం చేస్తున్నరో తెలుసు