రైతుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి

 రైతుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి

హైదరాబాద్, వెలుగు: క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ సేవలు రైతులకు ఎట్లా అందుతున్నాయో తెలుసుకోవడంతో పాటు వాళ్లనుంచి  సలహాలు, సూచన లు తీసుకునేందుకు వ్యవసాయ శాఖ ప్రత్యేకంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేసిం ది. పబ్లిక్ గార్డెన్​లోని రైతుబంధు సమితి అధ్యక్షుడి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కాల్ సెంటర్ ను వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. కాల్ సెంటర్ ద్వారా రైతులకు సమస్యలుంటే పరిష్కరించేం దుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. వ్యవసాయ శాఖ వద్ద రాష్ట్రంలోని 63 లక్షల మంది రైతుల ఫోన్ నంబర్లు అందుబాటులో ఉన్నాయని, ఎంపిక చేసిన రైతులతో కాల్ సెంటర్ ​నుంచి ప్రతిరోజు మాట్లాడు తారని తెలిపారు. ఆ తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాకర్ల క్లస్టర్ పరిధిలో ఇటీవల మరణించిన రైతు వెంకటేశ్వర్లు కొడుకు రవీంద్రబాబు తో మంత్రి మాట్లాడారు.