నష్టాల్లో కొనసాగుతున్న దేశీయ స్టాక్ మార్కెట్

నష్టాల్లో కొనసాగుతున్న దేశీయ స్టాక్ మార్కెట్

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ వారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. 450 పాయింట్లకుపైగా నష్టంలో సెన్సెక్స్ కొనసాగుతుండగా... 130 పాయింట్లకు పైగా నష్టంలో నిఫ్టీ ట్రేడ్ అవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ 74 రూపాయల 59 పైసల వద్ద కొనసాగుతోంది. అమెరికా మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ముగిశాయి. ఈ రోజు అమెరికా మార్కెట్లకు సెలవు ప్రకటించారు. ఉక్రెయిన్ –రష్యా యుద్ధ వాతావరణం దృష్ట్యా మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. పుతిన్ తో చర్చలకు బైడెన్ అంగీకరించడం.. ఈనెల 24న అమెరికా, రష్యా విదేశాంగ మంత్రుల భేటీ జరగనుండటంతో.. ఉద్రిక్తతలకు తెరపడనుందని భావిస్తున్నారు. మరోవైపు ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా బలగాల మోహరింపు, సైన్యం సన్నద్ధతపై వస్తున్న వార్తల దృష్ట్యా ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉన్నారు. ముడిచమురు ధరలు, ఎఫ్ఐఐల అమ్మకాలు, ఎఫ్ అండ్ ఓ కాంట్రాక్టుల గడువు తీరనుండటం ఈ వారం ట్రేడింగ్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎల్ఐసీ ఐపీవోత..ఈక్విటీ మార్కెట్లలో స్వల్ప దిద్దుబాటు ఉండొచ్చని భావిస్తున్నారు నిపుణులు.

మరిన్ని వార్తల కోసం:

మంత్రి మృతి పట్ల ప్రముఖుల సంతాపం