రెండోరోజు ముగిసిన మంచిరెడ్డి ఈడీ విచారణ

రెండోరోజు ముగిసిన మంచిరెడ్డి ఈడీ విచారణ

టీఆర్ఎస్ ఎమ్మెల్యే  మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఈడీ విచారణ రెండో రోజు ముగిసింది. ఎమ్మెల్యే కిషన్ రెడ్డిపై ఫెమా ఉల్లంఘనలకు పాల్పడ్డారన్ని ఆరోపణలు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా విదేశాలలో లావాదేవీలు జరిపాడన్న అంశంపై ఈడీ విచారిస్తోంది. పదిగంటల పాటు ఆయన్ని విచారించిన అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. విదేశీ టూర్లో జరిపిన ట్రాన్సక్షన్స్ పై ఈడీ అధికారులకు కిషన్ రెడ్డి డాక్యుమెంట్స్ సమర్పించారు. విదేశీ టూర్లపై ఈడీకి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు.

ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద 2015లో రిజిస్టరైన కేసుల్లో వివరాలను ఈడీ రాబడుతోంది. ఇందులో భాగంగా మంచిరెడ్డి కిషన్ రెడ్డిని విచారిస్తోంది. 2014 ఆగస్టులో మంచిరెడ్డి కిషన్ రెడ్డి విదేశాలకు వెళ్ళారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలలో పర్యటించారు. విదేశాలకు వెళ్లే ముందు ఫారెక్స్ కార్డ్ కూడా తీసుకెళ్లినట్లు తెలిసింది. డబ్బులు అవసరం కావడంతో అమెరికాలోని తన బంధువుల నుంచి డబ్బులు తీసుకున్నట్లు సమాచారం. విదేశాల నుంచి జరిగిన ట్రాన్స్ఫర్స్ ఇండియాలోని మంచిరెడ్డికి చెందిన అకౌంట్స్తో లింక్ అయ్యాయి. వీటికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలను ఈడీ అధికారులు గుర్తించారు.