- ఐఐఎం బెంగళూరుకు 27, ఐఎస్బీకి 28వ ర్యాంకు
- అమెరికాకు చెందిన హార్వర్డ్‌కు ఫస్ట్ ర్యాంకు
- టాప్ 3 వర్సిటీలన్నీ యూఎస్వే.. టాప్ 10లోనూ 6
ఈ సారి గ్లోబల్ ఎంబీఏ ర్యాంకుల్లో మన 3 ఇన్స్టిట్యూట్లు టాప్ 50లో చోటు దక్కించుకున్నాయి. 2020కి గాను ఫైనాన్షియల్ టైమ్స్ విడుదల చేసిన గ్లోబల్ ఎంబీఏ ర్యాంకుల్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బెంగళూరు 27వ ర్యాంకు సాధించగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌కు 28, ఐఐఎం కలకత్తాకు 42వ ర్యాంకు వచ్చింది. ఐఐఎం అహ్మదాబాద్ టాప్ 100లో స్థానం సంపాదించింది. 61వ ప్లేస్‌లో నిలిచింది. గతేడాది 33వ స్థానంలో ఉన్న ఐఐఎం బెంగళూరు ఈసారి ఆరు ర్యాంకులు మెరుగుపరుచుకుంది. ఐఐఎం కలకత్తా కూడా ఏడు ర్యాంకులు పైకి ఎగబాకింది. అయితే ఐఎస్బీ మాత్రం గతేడాది (24)తో పోలిస్తే 4 ర్యాంకులు దిగజారింది. గతేడాది 47వ ర్యాంకు సాధించిన ఐఐఎం అహ్మదాబాద్ ఈసారి ఏకంగా 14 ర్యాంకులు కిందికి పడిపోయింది. 61 స్థానంతో సరిపెట్టుకుంది.
టాప్ 10లో ఫ్రాన్స్వి రెండు
లిస్టులో అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ టాప్‌లో నిలిచింది. గతేడాది రెండో స్థానం సాధించిన ఈ వర్సిటీ ఈసారి ఫస్ట్ ప్లేస్‌లో నిలబడింది. గతేడాది టాపర్ స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (అమెరికాదే) ఈసారి మూడో స్థానంతో సరిపెట్టుకుంది. రెండో స్థానంలోనూ అమెరికాకే చెందిన యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా నిలిచింది. మొత్తంగా టాప్ 3లో అమెరికా వర్సిటీలే ఉన్నాయి. టాప్ 10లో ఆరున్నాయి. టాప్ 10లో చోటు దక్కించుకున్న వర్సిటీల్లో ఫ్రాన్స్వి రెండు.. చైనా, యూకేవి ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. టాప్ 100లో చైనావి 9 వర్సిటీలున్నాయి. యూకేకు చెందిన వర్సిటీలూ టాప్ 100లో తొమ్మిది ఉండగా టాప్ 20లో రెండే ఉన్నాయి. గత మూడేళ్లలో వర్సిటీల నుంచి పాసైన గ్రాడ్యుయేట్ల యావరేజ్ శాలరీలను ర్యాంకింగ్‌కు ఓ కొలతగా తీసుకున్నారు. ఐఐఎం బెంగళూరుకు ఈ శాలరీ యావరేజ్ రూ. కోటి 30 లక్షలుండగా, ఐఎస్బీకి రూ. కోటి 14 లక్షలు, ఐఐఎం కలకత్తాకు రూ. కోటి 18 లక్షలు, ఐఐఎం అహ్మదాబాద్‌కు రూ. కోటి 33 లక్షలుంది.
టాప్ 10 ఇన్స్టిట్యూట్లు
1. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ (అమెరికా)
2. యూనివర్సిటీ ఆఫ్ పెన్సె ల్వేనియా
(అమెరికా)
3. స్టా న్ ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినె
స్ (అమెరికా)
4. ఇన్ సీడ్ (ఫ్రాన్స్)
5. సియ్ బ్స్ (చైనా)
6. ఎంఐటీ స్లొ వాన్ (అమెరికా)
7. లండన్ బిజినెస్ స్కూల్ (యూకే)
8. కొలంబియా బిజినెస్ స్కూల్ (అమెరికా)
9. హెచ్ ఈసీ ప్యా రిస్ (ఫ్రాన్స్)
10. యూనివర్సిటీ ఆఫ్ షికాగో (అమెరికా)
మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి