లోక్సభ ఎలక్షన్లపై..ఆనంద్ మహీంద్రా ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్

లోక్సభ ఎలక్షన్లపై..ఆనంద్ మహీంద్రా ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్

ప్రముఖ పారిశ్రామికవేత్తలలో మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఒకరు మనకు తెలిసిందే. ఆయన సోషల్ మీడియాలో ఎప్పుడూ చాలా యాక్టివ్ గా ఉంటా డు..తన అభిప్రాయాాలను తరుచుగా నెటిజన్లతో పంచుకుంటాడు. బిజీ బిజీగా ఉండే ఈ బిలియర్ తన వాల్యుబుల్ టైంను కేటాయిస్తూ టాలెంట్ ను ప్రోత్సహిస్తూనే ఉంటారు.. దీంతో అన్ని ట్రెండింగ్ లో ఉన్న వాటిని కూడా నెటిజన్లతో పంచుకుంటాడు. తాజాగా 2024 లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నందున Xలో ఓ పోస్ట్ షేర్ చేశాడు. ఇది ఇప్పుడు ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతోంది. 

అండమాన్ నికోబార్ దీవుల్లో గిరిజనుడు ఓటే వేసినట్లు చూపిస్తున్న ఓ పిక్చర్ ను చూపిస్తూ భారతదేశ ప్రజా స్వామ్య  ప్రయాణంలో ఇది ఒక ముఖ్యమైన ఘటన అని X లో షేర్ చేశారు. ఈ పోస్ట్ నెటిజన్లకు తెగ నచ్చేసింది. ఈ విషయాన్ని హైలైట్ చేసినందుకు బిలియనీర్ ను పొగడ్తలతో ముంచెత్తారు. 

అసలు కథ ఏంటంటే.. గ్రేట్ నికోబార్ దీవుల్లో నివసించే షోంపెన్ తెగ నివసిస్తోంది. ఇది చాలా ప్రమాదకరమైన గిరిజన తెగలలో ఒకటి. అయితే ఈ తెగకు తొలిసారి ఓటు హక్కు వచ్చింది..తెగకు చెందిన సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. షోంపెన్ తెగకు చెందిన ఓ గిరిజనుడు ఓటు హక్కు వినియోగించుకున్న చిత్రాన్ని..మన బిలియనీర్ ఆనంద్ మహీంద్రా X లో షేర్ చేశారు. 

ఈ ఫొటో షొంపెన్ తెగకు చెందిన సభ్యుడు ఓటు వేసి బూత్  నిబలడి ఉన్నట్లు చూపిస్తుంది. దీనికి ఆనంద్ మహీంద్రా ఓ క్యాప్షన్ ఇచ్చా డు. నాకు ఇది 2024లో ఎన్నికలలో అత్యుత్తమ చిత్రం. గ్రేట్ నికోబార్ లోని షోంపెన్ తెగకు చెందిన ఏడుగురు సభ్యులతో ఒకరు మొదటి సారిగా ఓటు వేశారు. ఇది ప్రజా స్వామ్యం.. ఎదురులేని శక్తి అని రాశారు. 

ఈ ఫొటోను అప్ లోడ్ చేసిన వెంటనే నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. భారత దేశ ఓటింగ్ చరిత్రలో ఇది ప్రధాన సంఘటన అని అభినందిస్తూ నెటిజన్లు పోస్ట్ లు పెట్టారు. ఎవరు గెలిచారు.. ఎవరూ ఓడారు అనే విషయాన్ని పక్కన పెడితే.. సమాజంలో అట్టడుగున ఉన్న వ్యక్తి ..ప్రజాస్వామ్యం అనే పండుగను జరుపుకున్నాడు. భారత్ దేశ ప్రజాస్వామ్యంలో ఇది నిజమైన విజయం అని రాశాడు. 

ఏదీ ఏమైనప్పటికి లోక్ సభ ఎలక్షన్లపై ఆనంద్ మహీంద్రా పోస్ట్ నెటిజన్లలో ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ కొత్త కొత్త విషయాలను, ట్రెండింగ్ న్యూస్ ను ఆనంద్ మహీంద్రా షేర్ చేయడం పట్ల నెటిజన్ చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.