T20 World Cup 2024: మెంటార్‌గా అతడే సరైనోడు: వెస్టిండీస్ దిగ్గజంపై పాక్ క్రికెట్ బోర్డు కన్ను

T20 World Cup 2024: మెంటార్‌గా అతడే సరైనోడు: వెస్టిండీస్ దిగ్గజంపై పాక్ క్రికెట్ బోర్డు కన్ను

అమెరికా, వెస్టిండీస్ ఆతిధ్యమిస్తున్న టీ20 వరల్డ్ కప్ కు పాకిస్థాన్ జట్టుకు మెంటార్‌గా దిగ్గజ ఆటగాడు వివియన్ రిచర్డ్స్‌ను ఎంపిక చేసేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆసక్తిగా ఉంది. రిచర్డ్స్ 2016 నుండి పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో క్వెట్టా గ్లాడియేటర్స్‌కు మెంటార్‌గా పని చేసిన అనుభవం ఉంది. పాక్ క్రికెట్ బోర్డు నివేదికలు ప్రకారం ప్రస్తుత ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ జాతీయ జట్టులో అనుభవమున్న ప్లేయర్ ను మెంటార్ గా నియమించేందుకు చర్చలు జరుపుతుంది.

ఇందులో భాగంగా కరేబియన్‌లోని పరిస్థితుల గురించి అవగాహన ఉన్న రిచర్డ్స్ ను అనుభవం ఉపయోగపడుతుందని భావిస్తున్నారట. పాక్ ఆటగాళ్లకు రిచర్డ్స్ పట్ల గొప్ప గౌరవం ఉండడంతో ఈ విండీస్ దిగ్గజం మెంటార్ గా ఉంటాడనే వార్తలు వస్తున్నాయి. పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ ఫిబ్రవరి 28, 2024 న వన్డే, టీ 20 లకు ప్రధాన కోచ్‌గా ప్రపంచ కప్ విజేత గ్యారీ కిర్‌స్టెన్‌ను నియమించిన సంగతి తెలిసిందే. టెస్టులకు మాత్రం ఆస్ట్రేలియన్ మాజీ పేసర్ జాసన్ గిల్లెస్పీను ప్రధాన కోచ్ గా ఎంపిక చేశారు. మాజీ పాకిస్థాన్ ఆల్ రౌండర్ అజర్ మహమూద్‌ను మూడు ఫార్మాట్లలో జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా నియమించారు.

వరల్డ్ కప్ కు ముందు నాలుగు మ్యాచ్ ల టీ 20 సిరీస్ ఆడనున్నాయి. మే 22 నుంచి మే 30 వరకు ఈ సిరీస్ జరుగుతుంది. ఈ సిరీస్ కోసం ఇటీవలే గ్యారీ కిర్ స్టెన్ పాక్ జట్టుతో కలిశాడు. జూన్ 1 నుంచి టీ20 వరల్డ్ కప్ ప్రారంభమవుతుంది. జూన్ 30 న ఫైనల్ తో ఈ పొట్టి సమరం ముగుస్తుంది. పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జట్టు ప్రాక్టీస్ మ్యాచ్ లు లేకుండా నేరుగా మెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టోర్నీలో బరిలోకి దిగబోతుంది.