గుంటూరు కారం సాంగ్ లీక్!.. సోషల్ మీడియా షేక్

గుంటూరు కారం సాంగ్ లీక్!.. సోషల్ మీడియా షేక్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh babu), త్రివిక్రమ్ (Trivikram) కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం (Guntur kaaram). ఈ సినిమాలో.. శ్రీలీల(Sreeleela), మీనాక్షి చౌదరి(Meenakshi chaudary) హీరోయిన్స్ గా నటిస్తున్నారు. చాలా రోజుల తరువాత,మహేష్ బాబు నుండి వస్తున్న పక్కా మాస్ అండ్ కమర్షియల్ సినిమా కావడంతో.. ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అందుకే ఈ సినిమా నుండి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది.

తాజాగా ఈ మూవీ నుండి సాంగ్ లీక్ అయ్యిందంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఎగరేస్తోన్న చొక్కాపై గుండీ..ఎగబడి ముందడికే..వెళ్లిపోతాది నేన్నిక్కిన బండి..మసాలా బిర్యానీ..అంటూ పాట లీకవ్వగా..ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండీగా ఉంది. తమన్ మాస్ బీట్ అదిరిపోయిందని కొందరు, లిరిక్స్ కూడా మహేష్ బాబుకు పర్ఫెక్ట్ గా సరిపోయాయని మరికొందరు..ఇంకొందరైతే..మాస్ బిర్యానీ సరిపోలే..ఇంకా కావాలి..అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరి ఇది ఒరిజినల్ సాంగ్ లేక..ఫ్యాన్ మేడ్ సాంగ్ అనేది క్లారిటీ లేదు. రీసెంట్ గానే గుంటూరు కారం ప్రొడ్యూసర్ నాగ వంశీ..ఫస్ట్ సింగిల్ విషయంలో ఓ క్లారిటీ ఇచ్చాడు. దీపావళి కి అదిరిపోయే ఫస్ట్ సింగిల్ తో తప్పకుండ వస్తామని. అంతలోనే ఫస్ట్ సింగిల్ లీక్ అంటూ వస్తోన్న వార్తలపై ఫ్యాన్స్ డిస్సపాయింట్ అవుతున్నారు. 

ALSO READ :- Women Special : ప్రేమ, బ్రేకప్ అంతా ఈ హార్మోన్ల వల్లనే...

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ (Harika hasini creations) పై చినబాబు(Chinababu), సూర్యదేవర నాగవంశీ (Suryadevara nagavanshi) సంయుక్తంగా నిర్మిస్తున్నఈ మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతుంది.