మరోసారి బయటపడ్డ యాదాద్రి టెంపుల్ నిర్మాణ లోపాలు

మరోసారి బయటపడ్డ యాదాద్రి టెంపుల్ నిర్మాణ లోపాలు

యాదగిరిగుట్ట: శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలోని ఫ్లోరింగ్ మరోసారి కుంగింది. అత్యున్నత ప్రమాణాలతో ఆలయాన్ని పునర్నించామని చెబుతున్నా రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా... కొద్దిపాటి వానకే నిర్మాణ లోపాలు బయటపడుతున్నాయి. వారం రోజులుగా కురుస్తున్న వానకు ఫ్లోరింగ్ 10 మీటర్ల మేర కుంగాయి. ప్రధాన ఆలయంలోని దక్షిణ రాజ గోపురం పక్కన కృష్ణశిలతో ఏర్పాటు చేసిన ఫ్లోరింగ్ కుంగింది. గతంలోనూ చిన్న వానకే ఫ్లోరింగ్ కుంగడంతో.. రాతి బొండలు తొలగించి రిపేర్లు చేశారు. రిపేర్లు చేసి ఏడాది కాకముందే ఫ్లోరింగ్ కుంగింది. దీంతో మరోసారి నిర్మాణ లోపాలు బయటపడ్డాయి.