ఢిల్లీ లిక్కర్ స్కాంలో విజయ్ నాయర్ అరెస్ట్

ఢిల్లీ లిక్కర్ స్కాంలో విజయ్ నాయర్ అరెస్ట్

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాంలో తొలి అరెస్ట్ జరిగింది. ముంబయి కేంద్రంగా పని చేస్తున్న ఓన్లీ మచ్ లౌడర్ కంపెనీ మాజీ సీఈవో విజయ్ నాయర్ ను సీబీఐ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఇప్పటికే లిక్కర్ కేసులో నిందితుడిగా ఉన్న ఢిల్లీ డిప్యూటీ సీఎం  మనీశ్ సిసోడియాకు విజయ్ నాయర్ సన్నిహితుడని సమాచారం. విజయ్ నాయర్ తరపున లిక్కర్ వ్యాపారీ సమీర్... మనీశ్ సిసోడియా అనుచరుడైన అర్జున్ పాండేకు ముడుపులు అప్పజెప్పినట్లు పోలీసులు తెలిపారు.  

ఇక ఈ లిక్కర్ స్కాంలో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, రామచంద్రపిళ్లై సహా.. 15మంది నిందితులుగా ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీలో మనీలాండరింగ్ పై ఇప్పటికే ఈడీ కూడా విచారణ చేస్తోంది.