
హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లోని ఉన్నత విద్యా మండలి లో ఫేక్ సర్టిఫికెట్ల నివారణ పై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, డీజీపీ మహేందర్ రెడ్డి,ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి,టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్, బాసర ట్రిపుల్ ఐటీ ఇన్ చార్జీ వీసి వెంకటరమణ పలువురు ఉన్నత విద్యాశాఖ అధికారులు హాజరయ్యారు.
ఫేక్ సర్టిఫికెట్లను గుర్తించేందుకు ఆన్లైన్ స్టూడెంట్ అకాడమీ వెరిఫికేషన్ సర్వీసును ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.కాసేపట్లో ఆన్లైన్ స్టూడెంట్ అకాడమీ వెరిఫికేషన్ సర్వీసును మంత్రి సబితా ఇంద్రారెడ్డి,డీజీపీ మహేందర్ రెడ్డి ప్రారంభించనున్నారు.