- తెలుగు అకాడమీలోపేపర్ కొరత.. ప్రింటింగ్ సమస్యలే కారణం
- టీసీలు కావాలంటే పుస్తకాలు ఇవ్వాలనే నిబంధన
- చదువులు సాగక విద్యార్థుల ఇబ్బందులు
హనుమకొండ, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెజారిటీ ప్రభుత్వ జూనియర్కాలేజీలకు పాఠ్యపుస్తకాలు ఇంకా రాలేదు. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే సరిపడా పుస్తకాలు పంపిణీ చేయాల్సిన ప్రభుత్వం ఇంతవరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. కాలేజీలు మొదలై రెండు నెలలైనా బుక్స్రాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతోనే కాలేజీల ప్రిన్సిపాల్స్ఇంటర్పూర్తి చేసుకున్న విద్యార్థుల పుస్తకాలను తెప్పించే పనిలో పడ్డారు. ఇంటర్పాస్అయి టీసీ కోసం వచ్చే స్టూడెంట్స్ ఓల్డ్బుక్స్ఇస్తేనే ట్రాన్స్ఫర్సర్టిఫికెట్ఇస్తామని ఖరాకండీగా చెబుతున్నారు. దీంతో ఇటు టీసీల కోసం పాసౌట్అయిన స్టూడెంట్స్ఇబ్బందులు పడుతుండగా..పాత, చినిగిపోయిన పుస్తకాలతో ఇంటర్చదివే వారు అవస్థలు పడుతున్నారు.
రెండున్నర నెలలవుతున్నా..
ఈ ఏడాది జూన్15 నుంచి ఇంటర్మీడియట్కాలేజీలు మొదలయ్యాయి. అప్పటికే సర్కారు పుస్తకాలు పంపించాల్సి ఉండగా పట్టించుకోలేదు. ఉదాహరణకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో 47 ప్రభుత్వ కాలేజీలుండగా.. అందులో ఫస్ట్, సెకండ్ఇయర్రెగ్యులర్, ఒకేషనల్ కోర్సుల్లో దాదాపు 30 వేల మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. ఇంటర్మీడియట్లో ఎంపీసీ, బైసీపీ, హెచ్ఈసీ, సీఈసీ తో పాటు ఒకేషనల్ కోర్సులు చదువుతున్న వారికి సుమారు లక్షన్నర బుక్స్ అవసరమవుతాయని జిల్లా ఆఫీసర్లు ఇండెంట్ పంపారు. కానీ కాలేజీలు ప్రారంభమై రెండు నెలలు దాటుతున్నా ఒక్క పుస్తకం కూడా పంపలేదు.
తెలుగుఅకాడమీలో పేపర్ల కొరతతోనే..
రాష్ట్ర వ్యాప్తంగా కావాల్సిన పుస్తకాలను ముద్రించే తెలుగు అకాడమీలో పేపర్కొరత, ప్రింటింగ్ సమస్యలే బుక్స్రాకపోవడానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. విద్యాసంవత్సరం ప్రారంభానికి మూడు, నాలుగు నెలల ముందే కాగితం కొనుగోలుకు టెండర్లు పిలిచి పుస్తకాలు ప్రింట్ చేయాల్సి ఉంటుంది. కానీ కరోనా తరువాత పేపర్కాస్ట్పెరిగిపోగా.. కాంట్రాక్టు సంస్థలు పాత రేటుతో పేపర్అందించడానికి ముందుకు రాలేదని తెలిసింది. ఆఫీసర్లు, కాంట్రాక్టర్ల సంప్రదింపుల తరువాత పేపర్ తెప్పించినప్పటికీ.. ప్రింటింగ్ఛార్జీల విషయంలో మరోసారి ఆటంకాలు ఏర్పడ్డాయి. పేపర్కాస్ట్ పెరిగిపోగా..ప్రింటింగ్ఛార్జీలు కూడా పెంచాలని సంబంధిత కాంట్రాక్టర్లు డిమాండ్ చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో కాంట్రాక్టర్లు, ఆఫీసర్ల మధ్య చర్చలతోనే టైం వృథా అయ్యింది. చివరకు ఆలస్యంగా ప్రింటింగ్ మొదలుపెట్టగా అది కూడా అరకొరగానే చేస్తున్నట్టు తెలిసింది.
ప్రైవేట్ బుక్‌స్టాల్స్‌కు ఇంటర్ బుక్స్
సర్కారు కాలేజీల్లో ఇంటర్పాఠ్యపుస్తకాల కొరత వేధిస్తుండగా ప్రైవేట్బుక్స్టాల్స్నిర్వాహకులకు మాత్రం కాసుల వర్షం కురిపిస్తోంది. తెలుగు అకాడమీ ప్రింట్చేసే బుక్స్సైతం ముందు ప్రైవేట్బుక్స్టాల్స్కే చేరుతున్నట్టు సమాచారం. దీంతో సిలబస్ మిస్‌కాకుండా ఉండేందుకు సర్కారు కాలేజీల విద్యార్థులు బుక్స్స్టాల్స్లో కొనుక్కోవాల్సిన దుస్థితి నెలకొంది.
పాత బుక్స్ఇస్తేనే టీసీలు !
పుస్తకాలు రాకపోవడంతో కాలేజీల ప్రిన్సిపాల్స్ మరో దారి చూసుకోవాల్సి వచ్చింది. కాలేజీల్లో ఇంటర్‌పూర్తి చేసిన విద్యార్థులు వేరే కళాశాలల్లో జాయిన్ కావడానికి టీసీల కోసం వస్తున్నారు. వీరు తప్పనిసరిగా పాత పుస్తకాలు ఇస్తేనే టీసీలు ఇస్తామని కాలేజీల్లో స్టాఫ్తెగేసి చెబుతున్నారు. ఇంటర్తర్వాత ఎంసెట్, నీట్, మరికొన్ని ప్రవేశ పరీక్షలు రాసేవారు లాంగ్‌టర్మ్ కోచింగులు తీసుకుంటుంటారు. వీరికి పాత బుక్స్అవసరం ఉంటుంది. కానీ పుస్తకాలను తిరిగివ్వాల్సిందిగా ప్రిన్సిపాల్స్ఆర్డర్ వేస్తుండటంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కొంతమంది వాపస్చేస్తుండగా, మరికొందరు తమకు అవసరం ఉందని బతిమిలాడుకుంటున్నారు.
చినిగిన బుక్స్‌తో సర్ధుకుపోతున్నం
కాలేజీల్లో పుస్తకాల కొరత కారణంగా మా లెక్చరర్లు ఇంటర్ పాసైన స్టూడెంట్ల బుక్స్ఇప్పించారు. అందులో చాలావరకు చినిగిపోయి ఉంటున్నాయి. కొన్ని బుక్స్ఓపెన్చేయగానే పేపర్లు ఊడిపోతున్నాయి. మధ్యలో కొన్ని పేజీలు మిస్‌కావడంతో చదవడానికి ఇబ్బంది అవుతోంది. తొందరగా మాకు బుక్స్పంపించాలి. - శ్రీరామోజుల లహరి, హనుమకొండ
పాత బుక్స్ ఇస్తేనే టీసీ ఇస్తరట
నేను సీఈసీ చదివాను. డిగ్రీలో జాయిన్కావడానికి టీసీ తీసుకుందామని వస్తే పాత పుస్తకాలు ఇచ్చి టీసీ తీసుకోవాలని చెబుతున్నారు. నాకు ఇంటర్బుక్స్అవసరం ఉంది. కానీ రిటర్న్చేయాలని అడుగుతుండడంతో ప్రైవేట్‌లో కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. - రచ్చ నితిన్, నర్సంపేట
ఇండెంట్ పంపించినం
ఇంటర్పుస్తకాల కొరత ఉన్నది వాస్తవమే. ఇప్పటికే జిల్లాలో అవసరాన్ని బట్టి ఇంటర్మీడియట్బోర్డుకు ఇండెంట్ పంపించాం. అక్కడి నుంచి బుక్స్ రాగానే విద్యార్థులకు అందజేస్తాం. అప్పటివరకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం. - ఏ.గోపాల్, డీఐఈఓ, హనుమకొండ
