ఎడపల్లి, వెలుగు: జిల్లాలోని ప్రతి మారుమూల గ్రామానికి మిషన్‌భగీరథ నీరు అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని నిజామాబాద్కలెక్టర్ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ఎడపల్లి మండలం జానకంపేట వద్ద ఏర్పాటు చేసిన వాటర్బూస్టర్ సిస్టమ్ ను కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. దీని పనితీరు, ప్రయోజనాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. నివాస ప్రాంతాలకు సైతం మంచి నీరు అందించేలా చర్యలు చేపట్టాలన్నారు.
