అందరినోటా అదే టాపిక్..
ట్రై సిటీలో పెరుగుతున్న
ల్యాండ్ మాఫియా కంట్రోల్ చేయాలంటున్న
మంత్రులు, చీఫ్‍విప్ ప్రజల చేతిలో శిక్ష తప్పదని
హెచ్చరించిన మావోయిస్టులు
రౌడీషీట్ ఓపెన్ చేస్తామని సీపీ వార్నింగ్
వరంగల్ రూరల్, వెలుగు: కాకతీయ గడ్డపై కబ్జాల పర్వం నడుస్తోంది. అక్రమార్కులకు అది ప్రభుత్వ భూమైనా.. ప్రైవేట్ భూమైనా ఒక్కటే. కన్ను పడిందంటే చాలు. రెవెన్యూ డిపార్ట్ మెంట్‍లోని లొసుగులతో లేని పేపర్లు సృష్టిస్తున్నారు. తమదైన స్టైల్లో బెదిరిస్తున్నారు. అంగ, అర్థ బలమున్న బాధితులు పోలీస్ స్టేషన్ల గడప తొక్కుతుండగా.. అవి లేనివారు ఎవరికి చెప్పుకోవాలో తెలియక చితికిపోతున్నారు. కోట్లాది రూపాయల ఆస్తులను.. కబ్జా రాయుళ్లకు భయపడి రూ.లక్షలకు ఇచ్చుకొంటున్నారు. జిల్లాలో ఇలాంటి బాధితుల సంఖ్య వందల్లో ఉండగా.. ప్రభుత్వం, ఆఫీసర్లు మాత్రం ఒక్క భూకబ్జా సూత్రదారున్ని చూపలేకపోతున్నారు.
భూకబ్జా లపై మంత్రుల సీరియస్..
జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం, మంత్రులు భూకబ్జాలపై గతంలోనే సీరియస్ అయ్యారు. కడియంశ్రీహరి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న కొత్తలోనే భూకబ్జాలు ఆయన దృష్టికి వచ్చాయి.హన్మకొండ పబ్క్‍గార్డెన్‍లో నిర్వహించిన ఓ కార్యక్రమానికి ఆయన హాజరైన సందర్భంగా మాట్లాడుతూ.. నగరంలో భూకబ్జాలు పెరుగుతున్నట్లు చెప్పారు. కబ్జారాయుళ్లు తమ ప్రవర్తన మార్చుకోవాలని సూచించారు. మొన్నటికిమొన్న..పంచాయతీ రాజ్‍మంత్రి ఎర్రబెల్లి దయాకర్‍రావు
సైతం సిటీలోని భూకబ్జాలపై గరం అయ్యారు. అక్రమార్కులు ఎవరైనా ఊరుకోవద్దని పోలీస్ కమిషనర్‌రవీందర్‍కు సూచించారు. వారంక్రితం ప్రభుత్వ చీఫ్‍విప్‍దాస్యం వినయ్‍భాస్కర్ సైతం దేవాదాయశాఖ ఆఫీసర్లపై ఇదే అంశంపై సీరియస్‍అయ్యారు.
సీపీ ప్రమోద్‍కుమార్.. రౌడీషీట్ వార్నింగ్
భూకబ్జాలు పెరుగుతున్ననేపథ్యంలో .. అప్పటి సీపీ రవీందర్ కొంత అలర్ట్ అయ్యారు. స్పెషల్ పోలీస్ టీంలతో.. మావోయిస్టుల పేరుతో వచ్చిన లేఖల్లోని వ్యక్తులతో పాటు ట్రైసిటీలో ఇలాంటి దందాల్లో చురుగ్గా ఉండేవారి లిస్టు తెప్పించారు. పోలీస్‍హెడ్ క్వార్టర్స్ కేంద్రంగా ప్రత్యేకంగా ఓ సెల్‍ఏర్పాటు
చేసినట్లు చెప్పారు. అంతలోనే కరోనా రావడంతో దాని సేవలు ఆగిపోయాయి. కాగా, వరంగల్ కమిషనర్‍గా కొత్తగా వచ్చిన ప్రమోద్‍కుమార్.. రావడంతోనే కబ్జాదారులకు వార్నింగ్ ఇచ్చారు. ఈ నెల 22న నిర్వహించిన క్రైంరివ్యూలో అలాంటి వారిపై రౌడీ షీట్ ఓపెన్ చేయాలని ఆదేశించారు. ఇప్పటికే కబ్జాదారులు, స్టేషన్లవారీగా యాక్టివ్‍గా ఉన్న రౌడీల జాబితాను తెప్పించుకున్నట్లు సమాచారం.
మాకు.. ఓ టోల్ ఫ్రీ నంబర్ కావాలె
హైదరాబాద్‍లో ప్రభుత్వఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వం ఓ కీలక నిరయ్ణ ం తీసుకుంది. జీహెచ్‍ఎంసీ పరిధిలోని చెరువులు, కుంటలు, పార్కులు, ప్రభుత్వ స్థలాలు కబ్జా కాకుండా ఉండేందుకు ప్రత్యేక రక్షణ విభాగాన్ని తీసుకొచ్చింది. ‘అస్సెట్ ప్రొటెక్షన్‍సెల్’ ఏర్పాటు చేసి దీనికి ఇన్చార్జిగా ఐపీఎస్ అధికారిని నియమించింది. కబ్జాల సమాచారం తెలిపేందుకు జనాలకు 1800 599 0099
టోల్‍ఫ్రీ నంబర్‍ను అందుబాటులోకి తెచ్చింది. ఈ నెల 5న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్వయంగా దీనిని ప్రారంభించారు. రాష్ట్రంలోరెం డో అతి పెద్ద నగరమైన వరంగల్లో సైతం ఈ తరహా కబ్జాలుపెరుగుతున్నాయనేది ఓపెన్‍సీక్రెట్. కాగా, కబ్జాలకు అడ్డుకట్ట వేయడానికి కామన్ సిటిజన్‍సైతం ధైర్యంగా చెప్పేలా.. గ్రేటర్‍వరంగల్లో కూడా ఓ టోల్‍ఫ్రీ నంబర్‍పెట్టి.. దీని నిర్వహణకు ఐపీఎస్ అధికారిని నియమించాలని జనాలు కోరుతున్నారు.