ఢిల్లీ నుంచి గల్లీ దాకా మువ్వన్నెల పతాక రెపరెపలు

ఢిల్లీ నుంచి గల్లీ దాకా మువ్వన్నెల పతాక రెపరెపలు
  • ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో పాల్గొన్న నేతలు
  • కేంద్ర మంత్రుల మార్నింగ్‌‌‌‌‌‌‌‌ వాక్‌‌‌‌‌‌‌‌లు.. జెండాలతో ర్యాలీలు
  • చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌లో మావో ప్రభావిత ప్రాంతాల్లో జెండాల పంపిణీ

న్యూఢిల్లీ: 75 ఏండ్ల స్వాతంత్ర్య దినోత్సవాలను పురస్కరించుకుని చేపట్టిన ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో ఢిల్లీ నుంచి గల్లీ దాకా గవర్నర్లు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు,జా ప్రజా ప్రతినిధులు, సెలబ్రిటీలు, లీడర్లు, జనం పాలుపంచుకున్నారు. ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. తమ నివాసాల్లో జాతీయ జెండాను ఎగురవేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ తీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘‘తిరంగా.. మన గౌరవం. ప్రతి ఇండియన్‌‌‌‌‌‌‌‌ను ఇన్‌‌‌‌‌‌‌‌స్పైర్ చేస్తుంది.. ఏకం చేస్తుంది” అని అమిత్ షా ట్వీట్ చేశారు. ప్రజలు 15వ తేదీ దాకా తమ ఇండ్లపై జాతీయ జెండా ఎగురవేయాలని కోరారు. ఆగస్టు 13న ‘పార్టిషన్ హారర్స్ రిమెంబరెన్స్ డే’ సందర్భంగా ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఎగ్జిబిషన్ నిర్వహించారు. ‘‘దేశ విభజన సందర్భంగా లక్షలాది మంది మన సోదరులు, సోదరీమణులు పడ్డ బాధలను మనందరికీ తెలియజేసే ఎగ్జిబిషన్‌‌‌‌‌‌‌‌కు హాజరయ్యాను. వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలతో నడిచిన విద్వేష, విభజన రాజకీయాలు, మనపై మోపిన బాధను ఎప్పటికీ మరచిపోకూడదు’’ అని నడ్డా అన్నారు. 

రాష్ట్రాల్లో ఇలా..

యూపీలోని బల్లియాలో స్వాంతంత్ర్య సమరయోధుడు చిట్టూ పాండేకు కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ నివాళులర్పించారు. ఇండ్ల వద్ద జాతీయ జెండాలను ఎగురవేయాలని ప్రజలను ఓ ప్రధాని కోరడం దేశ చరిత్రలో తొలిసారి అని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. యూపీలోని ప్రగ్యారాజ్‌‌‌‌‌‌‌‌లో స్వతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యుల సన్మాన కార్యక్రమంలో స్మృతి మాట్లాడారు. మువ్వన్నెల జెండాను ఎగురవేసేందుకు ఎంతో మంది ప్రాణత్యాగం చేశారని చెప్పారు. 
 

హిమాచల్‌‌‌‌‌‌‌‌ ప్రదేశ్‌‌‌‌‌‌‌‌లోని ఉనాలో ప్రభాత్ ఫేరీ (మార్నింగ్ వాక్)ను బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ నిర్వహించారు. మొఘలులపై పోరాడిన యోధుడు దుర్గాదాస్ రాథోడ్‌‌‌‌‌‌‌‌ విగ్రహాన్ని జోధ్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రక్షణ మంత్రి రాజ్‌‌‌‌‌‌‌‌నాథ్ సింగ్ ఆవిష్కరించారు. జోధ్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మీరుట్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన తిరంగా ర్యాలీల్లో రాజ్‌‌‌‌‌‌‌‌నాథ్, నడ్డా పాల్గొన్నారు. 
    

చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌లో మావోయిస్టు ప్రభావిత బస్తర్ డివిజన్‌‌‌‌‌‌‌‌లోని మారుమూల ప్రాంతాలకు సీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఎఫ్ (సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్) జవాన్లు వెళ్లారు. అక్కడ జెండాలు పంపిణీ చేశారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్క సారి కూడా జెండా ఎగురవేయని ప్రాంతాలకు తాము వెళ్లామని సీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఎఫ్ ఆఫీసర్లు చెప్పారు. దంతెవాడ, బీజాపూర్, బస్తర్, సుక్మా జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల్లో వారం రోజుల్లో లక్షకు పైగా జాతీయ జెండాలను పంపిణీ చేశామని ఐజీ సాకేత్ కుమార్ సింగ్ వెల్లడించారు. 
    

రాజ్‌‌‌‌‌‌‌‌భవన్‌‌‌‌‌‌‌‌లో జెండాలను పంపిణీ చేసి హర్ ఘర్ తిరంగా ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌లో జమ్మూకాశ్మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పాల్గొన్నారు. అమరవీరులు, స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులర్పించారు. 
    

కర్నాటకలో గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్, సీఎం బసవరాజ్ బొమ్మై, కేంద్ర మంత్రులు జైశంకర్, నిర్మలా సీతారామన్, మంత్రులు, ఎమ్మెల్యేలు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. రామనగర జిల్లాలో ప్రభాత్ ఫేర్ కార్యక్రమంలో జై శంకర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ సొంత నియోజకవర్గమైన కనకపురలోని హరోహల్లి గ్రామంలో ర్యాలీ తీశారు. భారత్ మాతాకీ జై, వందే మాతరం అంటూ బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. జైన్ యూనివర్సిటీలో నిర్వహించిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. 
    

తమిళనాడులో గవర్నర్ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎన్ రవి, సినీ నటుడు రజినీ కాంత్, ఇతర లీడర్లు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. తక్కర్ బాప విద్యాలయ స్టూడెంట్లకు రాజ్‌‌‌‌‌‌‌‌భవన్‌‌‌‌‌‌‌‌లో జెండాలను గవర్నర్ రవి పంపిణీ చేశారు. స్వాతంత్ర్య సమరయోధులు, అమరవీరులను గౌరవించాలని రజినీకాంత్ పిలుపునిచ్చారు. మాజీ సీఎం పళినిస్వామి తన నివాసంలో జెండా ఎగురవేశారు.

దేశభక్తిని పెంచుతది: అజ్మీర్ దర్గా దీవాన్

హర్ ఘర్ తిరంగా ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌ ప్రజల్లో దేశభక్తిని పెంపొందిస్తుందని, ప్రపంచానికి ఐక్యతా సందేశాన్ని పంపుతుందని అజ్మీర్ దర్గా దీవాన్ జైనుల్ అబేదిన్ అలీ ఖాన్ అన్నారు. కులం మతాలకు అతీతంగా స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

స్వతంత్ర దినోత్సవాలపై రాజకీయాలా?: బీజేపీ

75వ స్వతంత్ర దినోత్సవాల సందర్భంగా పార్లమెంటులో ఎలాంటి కార్యక్రమం నిర్వహించలేదంటూ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ చేస్తున్న విమర్శలపై బీజేపీ మండిపడింది. స్వాతంత్ర్య దినోత్సవాలు రాజకీయాలకు సంబంధించినవి కాదని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా అన్నారు. ‘‘బీజేపీ నాయకులు తమ ఇండ్ల వద్ద జాతీయ జెండాలు ఎగురవేసి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ కూడా జెండా ఆవిష్కరించి ఉంటే.. సంబంధిత ఫొటోలు షేర్ చేయాలి” అని డిమాండ్ చేశారు. గతంలో కరోనా వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు కూడా ఫొటోలను వాళ్లు షేర్ చేయలేదన్నారు.