మంత్రి పదవిపై అధిష్టానం హామీ ఇచ్చింది : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మంత్రి పదవిపై అధిష్టానం హామీ ఇచ్చింది : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

తెలంగాణ మంత్రి వర్గంలో కొన్ని కీలక మంత్రి పదవులను ఇంకా నియమించలేదు. దీంతో కాంగ్రెస్ బాడా నేతల కళ్లన్నీ  వాటిపైనే ఉన్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీ బడ్జెట్ సమావేశం తర్వాత మీడియాతో చిట్ చాట్ చేశారు. తనకు హోం శాఖ మంత్రి  పదవి ఇస్తానంటూ అధిష్టానం హామీ ఇచ్చిందంటూ చెప్పుకొచ్చారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అసెంబ్లీ సమావేశాల తర్వాత కేబినెట్ విస్తరణ ఉంటుందని ధీమా వ్యక్తం చేశారాయన. తనకు హోం శాఖ ఇస్తే.. బీఆర్ఎస్ వాళ్లు కంట్రోల్ ఉంటారంటూ చెప్పుకొచ్చారాయన. 

Also Read: టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్ మహేందర్‌రెడ్డిని తొలగించండి 


కేసీఆర్ ని గద్దె దించేందుకే కాంగ్రెస్ లోకి వచ్చానని స్పష్టం చేశారాయన. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారని.. కేసీఆర్ కు బీజేపీయే శ్రీ రామరక్ష అంటూ జోస్యం చెప్పారు రాజగోపాల్ రెడ్డి. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవిత, సంతోష్ రావు, జగదీష్ రెడ్డితో పాటు అవినీతి చేసిన అందరూ జైలుకు వెళ్లడం ఖాయం అని స్పష్టం చేశారాయన. నల్గొండ, భువనగిరి పార్లమెంట్ స్థానాలకు మా కుటుంబ సభ్యులు నుంచి ఎవరూ పోటీ చేయటం లేదని వివరణ ఇచ్చారు. పార్టీ ఆదేశిస్తేనే పోటీ చేస్తామని.. సీటు ఎవరికి ఇచ్చినా గెలిపిస్తామని రాజ గోపాల్ రెడ్డి చిట్ చాట్ లో మాట్లాడారు.