విద్యుత్ కొనుగోళ్ల విచారణపై జస్టిస్ నరసింహరెడ్డి కమిషన్ ను రద్దు చేయాలన్న కేసీఆర్ పిటిషన్ పై తీర్పును రిజర్వ్ లో పెట్టింది హైకోర్టు. ఇవాళ కానీ.. జూలై 1న కానీ తీర్పును వెల్లడిస్తామని తెలిపింది.
ప్రభుత్వం వేసిన జస్టిస్ నరసింహారెడ్డి ఎంక్వైరీ కమిషన్‌ను రద్దు చేయాలని కోరుతూ కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.. ఈ పిటిషన్ ను ఇవాళ శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది హైకోర్టు. ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు.
విద్యుత్ కొనుగోలుపై ఎంక్వయిరీ చేయాలని నేరుగా మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు. ఎంక్వయిరీ వేయమని వారే చెప్పినప్పుడు ఈ కమిషన్ ఏకపక్షం ఎలా అవుతుంది. జస్టిస్ నరసింహారెడ్డి పెట్టిన ప్రెస్ మీట్ లో ఎక్కడ కంక్లూజన్ కి వచ్చినట్లు మాట్లాడలేదు. ప్రెస్ మీట్ వీడియో లో బయాస్డ్ గా మాట్లాడలేదు. నిబంధనల ప్రకారమే రెండుసార్లు నోటీసులు ఇచ్చాము. విద్యుత్ కొనుగోలు వ్యవహారంపై పబ్లిక్ నోటీస్ సైతం జారీ చేశాం. ఇందులో విచారణ మొత్తం ఓపెన్ గా జరుగుతుంది. ఇప్పటివరకు 15 మంది నుంచి వివరాలు సేకరించాం. 15 మందిలో మాజీ సీఎండీ ప్రభాకర్ రావుతో పాటు, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఉన్నారు. ప్రభాకర్ రావు తో పాటు జగదీశ్ రెడ్డి కమిషన్ ముందు హాజరయ్యారు. నిబంధనల ప్రకారమే ఎంక్వయిరీ కమిషన్ యాక్ట్ 8(b) కింద నోటీసులు జారీ చేశాం. కేసీఆర్ వద్ద ఉన్న ఎవిడెన్స్ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నాము. మేము ఇచ్చిన నోటీస్ పైన ప్రెస్ మీట్ లో ఎక్కడ ఏకపక్షంగా వ్యవహరించలేదు. అని కోర్టుకు వాదనలు వినిపించారు.
ముందుగా జూన్ 27న కేసీఆర్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ ఆదిత్య సోంధి వాదనలు వినిపించారు. జూన్ 30తో ఎంక్వైరీ కమిషన్ గడువు ముగుస్తుందని, ఈలోగా కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందని.. కాబట్టి కమిషన్ విచారణపై స్టే ఇవ్వాలని కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. పిటిషన్‌కు నెంబర్ కేటాయింపు అంశంపైనే నేడు విచారణ జరుపుతున్నాం. పిటిషన్‌కు నెంబర్ కేటాయించాక శుక్రవారం విచారణ చేస్తాం. అన్ని అంశాలను పరిశీలిస్తాం” అని తెలిపింది. దీంతో తొలుత పిటిషన్‌కు నెంబర్ కేటాయించాలని ఆదిత్య సోంధి కోరారు. దీంతో ఇవాళ (జూన్ 28న ప్రభుత్వ తరపున వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ లో పెట్టింది. ఇవాళ కానీ.. జూలై 1న కానీ తీర్పును వెల్లడిస్తామని తెలిపింది.
