భార్య కాపురానికి రావడం లేదని భర్త సూసైడ్‌‌‌‌

భార్య కాపురానికి రావడం లేదని భర్త సూసైడ్‌‌‌‌

నర్సాపూర్, వెలుగు : భార్య కాపురానికి రావడం లేదని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. నర్సాపూర్‌‌‌‌కు చెందిన దుర్గొళ్ల ప్రశాంత్(28)కు చేగుంట మండలం రామంతాపూర్‌‌‌‌కు చెందిన మనస్వినితో ఏప్రిల్‌‌‌‌లో వివాహమైంది. తండ్రి మృతి కేసులో సాక్ష్యం చెప్పాలంటూ మనస్వినిని ఆమె అక్క మే 17న అమ్మగారింటికి తీసుకెళ్లింది. తర్వాత మనస్వినిని ఇంటికి రావాలని ప్రశాంత్‌‌‌‌ కోరడంతో ఆమె తనకు కుదరదని, హైదరాబాద్‌‌‌‌లో ఉండేందుకు ఒప్పుకుంటేనే వస్తానని చెప్పింది.

బుధవారం రాత్రి మరోసారి మనస్విని అడుగగా ఆమె నిరాకరించింది. దీంతో మనస్తాపానికి గురైన ప్రశాంత్‌‌‌‌ ఇంట్లో ఉరి వేసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత గమనించిన కుటుంబ సభ్యులు హాస్పిటల్‌‌‌‌కు తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్‌‌‌‌ తెలిపారు. మృతుడి తల్లి నరసమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు నర్సాపూర్‌‌‌‌ ఎస్సై పుష్పరాజ్‌‌‌‌ తెలిపారు.