-feel-that-it-is-not-possible-to-host-the-Asian-Cup-in-Sri-Lanka._Lxz4rThsPV.jpg)
న్యూఢిల్లీ: శ్రీలంకలో ఆసియా కప్ నిర్వహణపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఆర్థిక సంక్షోభం, రాజకీయ అనిశ్చితి వల్ల ఆ దేశంలో టోర్నీని నిర్వహించడం సాధ్యం కాదని ఐసీసీ, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) భావిస్తున్నాయి. దీంతో ఆగస్ట్ 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు జరగాల్సిన ఈ మెగా టోర్నీ లంక నుంచి తరలిపోయే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే టోర్నీని ఎక్కడ నిర్వహిస్తారన్న దానిపై ఇప్పటివరకు సరైన సమాచారమైతే లేదు. కానీ ఆదివారం జరిగే ఐసీసీ సమావేశంలో దీనిపై ఓ స్పష్టత రానుంది. ఒరిజినల్ షెడ్యూల్ ప్రకారం 2020 సెప్టెంబర్‌లో టోర్నీని నిర్వహించాల్సి ఉంది. కానీ కొవిడ్ వల్ల 2021కు వాయిదా వేశారు. తర్వాత అనివార్య కారణాలతో రెండోసారి 2022కు పోస్ట్‌పోన్ చేశారు.