మహదేవపూర్, వెలుగు: కాళేశ్వర ముక్తీశ్వర క్షేత్రం సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతోంది. గురువారం వేలాదిగా భక్తులు సరస్వతి ఘాట్‌లో పుష్కర స్నానాలు ఆచరించి కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
త్రివేణి సంగమంలో నిర్వహిస్తున్న సరస్వతి నవరత్న మాలా హారతి, నిత్య గంగా హారతి భక్తులను ఆకట్టుకుంటోంది. ఇంకా నాలుగు రోజులే పుష్కరాలు ఉండడంతో చివరి సమయంలో భక్తుల రద్దీ పెరుగుతోంది.
