ప్రభుత్వ లాంఛనాలతో డీఎస్ అంత్యక్రియలు

ప్రభుత్వ లాంఛనాలతో డీఎస్ అంత్యక్రియలు

అధికారిక లాంఛనాలతో డీఎస్ అంత్యక్రియలు జరపాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని సీఎస్ శాంతికుమారికి ఆదేశాలు  జారీ చేశారు. నిజామాబాద్ లో  డీఎస్ అంత్యక్రియలు జూన్ 30న మధ్యాహ్నం జరగనున్నాయి. డీఎస్ పార్థివ దేహాన్ని ఇవాళ సాయంత్రం నిజామాబాద్  లోని  స్వగ్రామానికి తరలించనున్నారు. జూన్ 30న అభిమానుల సందర్శనార్థం నిజామాబాద్ బైపాస్ రోడ్డులోని స్థలంలో అంత్యక్రియలు చేయనున్నారు.

డీఎస్ ఇవాళ ఉదయం గుండెపోటుతో మరణించారు. పలువురు రాజకీయ ప్రముఖులు ఆయన భౌతిక కాయానికి నివాళి అర్పిస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు, శ్రేణులు భారీగా డీఎస్ ఇంటికి చేరుకుంటున్నారు.