నల్గొండలో హత్యాచారానికి గురైన బాలిక చివరి మాటలు

V6 Velugu Posted on Jul 21, 2021

నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కొప్పోలు గ్రామంలో హత్యకు గురైన మైనర్ బాలిక చివరి ఫోన్ సంభాషణ వైరల్ అవుతోంది. నిందితుడు పవన్.. బాలికను కొడుతూ.. అతని స్నేహితుడైన రాజు అనే వ్యక్తికి ఫోన్ చేశాడు. బాలికను చంపి జైలుకు వెళ్తానని పవన్ చెప్పడంతో.. బాధితురాలు తనను కాపాడాలని రాజును కోరింది. తాను వచ్చి మాట్లాడుతానని.. ఈ ఒక్కరోజు వదిలేయాలని రాజు నిందితుడికి చెప్పడం ఆడియోలో ఉంది. 

ఈ నెల 13న కొప్పోలులో మైనర్ బాలిక హత్యకు గురైంది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మైనర్ బాలికను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రజాసంఘాలు, రాజకీయ నాయకులు డిమాండ్ చేశారు. దాంతో ఫోరెన్సిక్ నిపుణులు ఈ నెల 17న డెడ్ బాడీకి రీ పోస్టుమార్టం చేశారు. బాలికపై అత్యాచారం జరిగిందని నిర్ధారించారు. నలుగురు యువకులను అరెస్ట్ చేసి, జైలుకు తరలించారు.

Tagged Telangana, NALGONDA, PHONE CALL, rape and murder, koppolu, minor girl murder, audio call, mruder

Latest Videos

Subscribe Now

More News