రాష్ట్రంలో నాలుగు రోజులు వానలు

రాష్ట్రంలో నాలుగు రోజులు వానలు
  • వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్​

హైదరాబాద్​, వెలుగు : రాష్ట్రానికి వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్​ ను జారీ చేసింది. నాలుగు రోజుల పాటు ఉత్తర, దక్షిణ తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడుతాయని ఆదివారం విడుదల చేసిన బులెటిన్​లో పేర్కొంది. హైదరాబాద్​లో పొద్దంతా పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, రాత్రిపూట వర్షం పడే చాన్స్​ ఉందని తెలిపింది.  రాబోయే నాలుగు రోజులు టెంపరేచర్లు కాస్తంత తగ్గొచ్చని చెప్పింది.

మరోవైపు ఆదివారం రాష్ట్రంలో పలుచోట్ల టెంపరేచర్లు భారీగా నమోదయ్యాయి. ఆలంపూర్​లో అత్యధికంగా 43.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నల్గొండ జిల్లా ఘనపూర్​లో 42.1, జంబుగలో 42, బయ్యారంలో 41.9, దస్తూరాబాద్​లో 41.6, ఆదిలాబాద్​ అర్బన్​లో 41.3, నాగారం 41.1, తెల్దేవరపల్లి, కల్వకుర్తిల్లో 40.5, పెబ్బేరులో 40.3 డిగ్రీల టెంపరేచర్లు రికార్డయ్యాయి. పాలకుర్తిలో 1.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది.